Rashmika: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు రష్మిక షరతులు విధించారా?

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రశాంత్ (Prashanth Neel) కాంబో మూవీ ఆగష్టు నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని అధికారికంగా క్లారిటీ వచ్చింది. ఈ సినిమా షూట్ మొదలయ్యే సమయానికి ఇతర సినిమాల షూటింగ్స్ పూర్తయ్యేలా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో రష్మిక (Rashmika) హీరోయిన్ గా ఎంపికయ్యారని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈ సినిమాలో నటించడానికి రష్మిక షరతులు విధించారని తనను డీ గ్లామరస్ గా చూపించబోనని మాట ఇస్తే మాత్రమే ఈ సినిమాలో నటిస్తానని చెప్పారని ప్రచారం జరుగుతోంది.

అయితే ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. సాధారణంగా ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోయిన్లను ఎప్పుడూ డీ గ్లామరస్ గా చూపించలేదనే సంగతి తెలిసిందే. మరోవైపు రష్మిక పుష్ప (Pushpa) సినిమాలో డీ గ్లామరస్ రోల్ లో నటించగా ఈ సినిమా ద్వారా రష్మికకు మంచి పేరు వచ్చింది. రష్మిక డీ గ్లామరస్ రోల్ లో నటించే ఛాన్స్ వస్తే వదులుకునే అవకాశం లేదు. అందువల్ల వైరల్ అయిన వార్తలు ఫేక్ వార్తలే తప్ప ఈ వార్తల్లో ఎలాంటి నిజం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్ తో నటించడానికి రష్మిక కూడా ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. యంగ్ టైగర్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రష్మిక కాంబినేషన్ లో నిజంగా సినిమా తెరకెక్కుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అటు ఎన్టీఆర్ ఇటు రష్మిక పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోగా ప్రశాంత్ నీల్ కు సైతం ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో ఎన్టీఆర్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus