Rashmika: రష్మిక బాలీవుడ్‌లో ఇంత అదృష్టం పట్టేసిందేంటి?

బాలీవుడ్‌ ప్రేమ కథల చరిత్రలో ‘ఆషికీ’కి ప్రత్యేకమైన పేజీ ఉంది. 32 ఏళ్ల క్రితం ఈ పేజీని రాయడం మొదలుపెట్టారు రాహుల్‌ రాయ్‌ – అను అగర్వాల్‌. రాయించింది మహేష్‌ భట్‌. ఆ తర్వాత తొమ్మిదేళ్ల క్రితం మరోసారి ‘ఆషికీ’ని తీసుకొచ్చారు. ఈసారి సీక్వెల్‌. దీన్ని రాసింది ఆదిత్య రాయ్‌ కపూర్‌ – శ్రద్ధ కపూర్‌. రాయించింది మోహిత్‌ సూరి. ఇప్పుడు మూడో పేజీ రాయబోతున్నారట. ఈ సారి రాస్తున్న వారిలో హీరోయిన్‌ ఫిక్స్‌ అయ్యింది అంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌ ప్రేమకథల ప్రేమికుల్లో ఇదే చర్చ నడుస్తోంది.

బాలీవుడ్‌లో రష్మిక మందన పరిస్థితి ఏంటంటారు. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు వచ్చింది డిస్కషన్‌ అనుకుంటున్నారా? ఎందుకంటే మేం పైన చెప్పిన ‘ఆషికీ 3’లో హీరోయిన్‌ ఆమెనే అనే టాక్‌ వినిపిస్తోంది కాబట్టి. అవును, రష్మిక ఓ ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా రూపొందిస్తారు అనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘ఆషికీ 3’ సినిమా తీస్తారట. ఇటీవల దీనికి సంబంధించి అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చింది.

1990లో మహేష్ భట్ ‘ఆషికీ’ తీసి అదరగొట్టారు. 2013లో మోహిత్ సూరి దానికి సీక్వెల్‌ తీసి వావ్‌ అనిపించారు. నేటి తరం యువతకు తగ్గట్టుగా సినిమాలో మార్పులు చేసి అనురాగ్‌ బసు ఈ సినిమా తీస్తారు అంటున్నారు. అయితే అనురాగ్‌ బసు ఇలాంటి సినిమాలు కూడా తీసి మెప్పిస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేదు. ఇలాంటి సమయంలో అలాంటి ఎపిక్‌ లవ్‌ స్టోరీ తీస్తే ఏమువుతుంది అనేది ఓ ఆలోచన.

అసలు ఈ పుకారు రావడానికి కూడా ఓ కారణం ఉంది. ఇటీవల కార్తిక్‌ ఆర్యన్‌, రష్మిక మందన కలసి ఓ యాడ్‌ చేశారు. అందులో ఇద్దరి లుక్‌, కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఇద్దరూ కలసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చ మొదలైంది. ఆ వెంటనే అది ‘ఆషికీ 3’ అయితే ఇంకా బెటర్‌ అని అంటున్నారు నెటిజన్లు. మరి ఈ విషయంలో అనురాగ్‌ బసు ఏమంటారో చూడాలి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus