Rashmika: రష్మిక ఇన్‌స్టాగ్రామ్ బయోలో మార్పులు… ఆందోళనలో అభిమానులు!

ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మిక భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మిక తాజాగా తన ఇంస్టాగ్రామ్ బయోలో మార్పులు చోటు చేసుకున్నాయి.

ఈ క్రమంలోనే ఇది గమనించిన అభిమానులు ఏంటి రష్మిక ఇంస్టాగ్రామ్ హ్యాక్ అయిందా అంటూ ఆందోళన చెందుతున్నారు. రష్మిక ఈ విషయంపై స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు. రష్మిక బయోలో తన పేరు రివర్స్ లో ఉండడంతో అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ బాలిక విద్య ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్లమ్ ప్రాజెక్ట్ బ్లాక్‌బోర్డ్ ప్రచారంలో ఒక భాగమని తెలిపారు.

రష్మిక ఈ స్క్రీన్ షాట్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ చదవడం తెలియనప్పుడే చిన్నారులు ఇలా భావిస్తారు. దానిని మార్చే లక్ష్యంతో ప్లం గుడ్‌నెస్ పనిచేస్తోందంటూ అసలు విషయం తెలియజేశారు. ఇకపోతే నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా కాంతర సినిమా విషయంలో రష్మిక పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంటున్నారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా తన గురించి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్స్ రావడంతో ఈమె తన పట్ల ట్రోలింగ్ చేసే ట్రోల్లర్స్ కు తనదైన శైలిలో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే కోలీవుడ్ హీరో విజయ్ తో కలిసి నటించిన వరిసు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus