Rashmika: సౌత్ సినిమాని దిగజారుస్తూ రష్మిక కామెంట్లు.. ట్రోలింగ్ షురూ..!

బాలీవుడ్లో టాలీవుడ్ హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు అంటే చాలు.. అక్కడ మీడియా వద్ద సౌత్ సినిమా గురించి ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు. మొదట్లో తాప్సి, తర్వాత రాశీ ఖన్నా.. ఇంకా కొంతమంది హీరోయిన్లు బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సమయంలో సౌత్ సినిమా గురించి ఏవేవో వంకలు పెట్టి మాట్లాడారు. ఫలితంగా దారుణంగా ట్రోల్ అయ్యారు. కాజల్, అనుష్క,తమన్నా వంటి హీరోయిన్లు 10 ఏళ్ళ చొప్పున సౌత్ లో రాణించినా.. అదే సమయంలో వారికి బాలీవుడ్ ఆఫర్లు వచ్చినా చాలా పద్దతిగా సౌత్ గురించి అక్కడి మీడియాతో చెప్పుకొచ్చారు.

వాళ్ళ డిసిప్లిన్ ఇప్పటి స్టార్ హీరోయిన్లకు లేనట్టే కనిపిస్తుంది. పాన్ ఇండియా ఇమేజ్ రాగానే.. తాము ఏదో సాధించేశామన్నట్టు ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారు. తాజాగా రష్మిక మందన కూడా ఆ లిస్ట్ లో చేరిందని చెప్పొచ్చు. విషయం ఏంటంటే.. ఈమె నటించిన బాలీవుడ్ చిత్రం మిషన్ మజ్ను రిలీజ్ కు రెడీ గా ఉంది. అయితే ఇది నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. జనవరి 20 నుండి ఈ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొన్న రష్మిక.. ‘బాలీవుడ్ పాటలు చాలా రొమాంటిక్ గా అనిపిస్తాయి. అలాగే వాటి సినిమాల్లో వాటి ప్లేస్మెంట్ కూడా బాగుంటుంది. కానీ సౌత్ సినిమాల్లో ఎక్కువగా మాస్ సాంగ్స్, ఐటెం సాంగ్స్ కే ప్రాధాన్యత ఇస్తారు. సినిమాల్లో వాటి ప్లేస్మెంట్ ఒకేలా అనిపిస్తుంది. రొమాంటిక్ నంబర్ల విషయంలో బాలీవుడ్ బెస్ట్’ అంటూ ఆమె కామెంట్లు చేసింది.రష్మిక చేసిన ఈ కామెంట్లు సౌత్ సినిమాని స్థాయిని తక్కువ చేసినట్లు ఉన్నాయని ఇక్కడి ప్రేక్షకులు మండిపడుతున్నారు.

ఆల్రెడీ ‘కాంతార’ విషయంలో కన్నడిగులకు టార్గెట్ అయిన రష్మిక… లేటెస్ట్ కామెంట్లతో సౌత్ ప్రేక్షకులందరికీ టార్గెట్ అయ్యిందనే చెప్పాలి.ఆల్రెడీ సోషల్ మీడియాలో రష్మిక ని సౌత్ ఇండస్ట్రీ బ్యాన్ చేయాలి అంటూ కామెంట్లు మొదలయ్యాయి. సౌత్ సినిమాకి చెందిన ఫిలిం మేకర్స్ అందరికీ రష్మిక క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus