Rashmika: నేషనల్ క్రష్ ఈ 5 ఏళ్ళకే ఇంత సంపాదించిందా..!

కన్నడ బ్యూటీ రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి చిత్రంతోనే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. అటు తర్వాత ఆమె చేసిన ‘గీత గోవిందం’ చిత్రం ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా రూ.100 కోట్ల క్లబ్ లో కూడా చేరింది ఆ చిత్రం. అందుకే ఈమెకు వెంటనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ దక్కింది.

అటు తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ ‘పుష్ప'(ది రైజ్) వంటి చిత్రాలతో ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న రష్మిక మరోపక్క ‘సీతా రామం’ వంటి సినిమాల్లో అఫ్రిన్ వంటి కీలక పాత్రలు చేయడానికి కూడా సై అంటుంది. ప్రస్తుతం రష్మిక రన్ బీర్ కపూర్ నటిస్తున్న ‘యానిమల్’, అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప ది రూల్’ వంటి సినిమాల్లో నటిస్తోంది.

ఇదిలా ఉండగా.. రష్మిక ఈ 5 ఏళ్లలో ఎంత సంపాదించిందో తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవుతారు. ఇప్పటివరకు రష్మిక 5 లగ్జరీ అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిందట. హైదరాబాద్ తో పాటు గోవా, కూర్గ్, ముంబై, మరియు బెంగళూరు వంటి ప్రదేశాల్లో రష్మిక ఈ అపార్ట్మెంట్లు కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వీటి విలువ రూ.100 కోట్ల పైనే ఉంటుందని వినికిడి. ఈ విషయం పై ఓ మీమ్ వైరల్ అవుతుండగా రష్మిక.. ఆ మీమ్ కు సమాధానం ఇచ్చింది.

‘ఇదంతా నిజమైతే బాగుణ్ణు’ అంటూ రష్మిక సమాధానం ఇచ్చింది. అంటే ఇందులో నిజం లేదన్నట్టు రష్మిక చెబుతుందన్న మాట. అయితే ఇది నిజమే అని నమ్మే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎందుకంటే 2019-20 టైంలో రష్మిక పై ఐటీ దాడులు కూడా జరిగాయి. అందుకే రష్మిక క్లారిటీ ఇచ్చినా కవర్ చేసినట్టు నెటిజన్లు ఫీలవుతున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus