హీరోయిన్ రష్మికా మందన్నా బ్యాచిలర్. ఫ్యామిలీ కర్ణాటకలో వుంటుంది. సినిమా షూటింగ్స్ నిమిత్తం ఆమె హైదరాబాద్ లో వుంటుంది. సాధారణంగా బ్యాచిలర్లు ఇంటి నుండి పచ్చళ్లు, పొడులు, స్వీట్లు తెచ్చుకుంటారు. కాని రష్మిక ఏం తెచ్చుకుంటుందో తెలుసా? నెయ్యి. ఇంటిలో తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యిని ఆమె తెచ్చుకుంటుంది. రష్మిక ఫిట్నెస్‌కి ఫుల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది.
హీరోయిన్ కదా… ఇవ్వాలి మరి. అందంగా, నాజూకుగా వుండాలి. ప్రతిరోజూ జిమ్ చేసే రష్మిక, డైట్ ఫాలో అవుతుంది. ఇంటి నుండి తెచ్చుకున్న నెయ్యిని వంటలకు వాడతానని చెబుతోంది. రష్మిక ఫ్యామిలీకి కర్ణాటకలో వ్యవసాయ భూములు, పొలాలు వున్నాయి. ఆమె ఇంటిలో ఆవులను పెంచుతారు. కోళ్ళు, బాతులు కూడా వున్నాయట. ఆవుపాలు నుండి తీసిన వెన్నతో తయ్యారు చేసిన నెయ్యిని రష్మిక హైదరాబాద్ తెచ్చుకుంటుందట.
సినిమాలకు వస్తే… ప్రజెంట్ అల్లు అర్జున్ ‘పుష్ప’ను రష్మిక యాక్సెప్ట్ చేసింది. త్వరలో షూటింగ్ స్టార్ట్ అయితే అందులో జాయిన్ అవ్వాలని చూస్తోంది. కన్నడలో ‘పొగరు’, తమిళంలో ‘సుల్తాన్’ చేస్తోంది.
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!