Rashmika, Samantha: అలాంటి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రష్మిక!

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. పుష్ప పార్ట్2లో రష్మిక పాత్రకు బాగానే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలతో రష్మిక బిజీ అవుతున్నారు. కన్నడ, తెలుగు భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న రష్మిక మందన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అదే పేరును సంపాదించుకుంటారేమో చూడాల్సి ఉంది. అయితే ఈ బ్యూటీ తాజాగా ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ప్రస్తుతం తమిళంలో నయనతార, తెలుగులో సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో విజయాలను అందుకుంటున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సక్సెస్ సాధిస్తే హీరోయిన్లకు పారితోషికం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ఈ రీజన్ వల్లే రష్మిక సైతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. తొలి సినిమా నుంచి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోయిన్ గా రష్మిక కెరీర్ ను కొనసాగిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో రష్మిక నటించనున్నారని వార్తలు వస్తుండగా ఈ సినిమాలో రష్మిక అమాయకురాలిగా కనిపిస్తుందని బోగట్టా.

గీతాఆర్ట్స్2 బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రష్మిక పుష్ప పార్ట్ 2తో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నారు. సినిమాసినిమాకు రష్మికకు క్రేజ్ పెరుగుతోంది. హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలలో రష్మిక నటిస్తున్నారు. రష్మికకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయలకు పైగా రష్మిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

ఒక టాలీవుడ్ స్టార్ హీరోతో ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. రష్మిక ఆ టాలీవుడ్ హీరోనే పెళ్లి చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus