Rashmika, Vijay: ఫొటోలు చెప్పేశాయ్‌… ‘ఫ్యామిలీ స్టార్‌’లో ఆ స్టార్‌ హీరోయిన్‌ కూడా?

విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన… టాలీవుడ్‌లో ఈ జోడీకి ఓ ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? వీరి బంధమేంటి? లాంటి ప్రశ్నలు చాలా ఏళ్లుగా వింటూనే ఉన్నాం. వాటికి సమాధానం చెప్పకుండా వాళ్లు ఆ రిలేషన్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. అందుకే ఈ ఇద్దరూ కలసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్‌, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వరుస సినిమాల్లో ఇద్దరూ నటించినా.. మళ్లీ ఎప్పుడు అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే దానికి సమాధానం ‘ఫ్యామిలీ స్టార్‌’ అని అంటున్నారు.

విజయ్‌ దేవరకొండ (Vijay) – మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రలో పరశురామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. సంక్రాంతికి వస్తుంది అంటున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం దిల్లీలో జరుగుతోందనే విషయం తెలిసిందే. అయితే ఆ సెట్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అవి షేర్‌ చేసిన వ్యక్తులు, సమయాలు బట్టి చూస్తే ఈ సినిమాలో విజయ్‌ – రష్మిక నటిస్తున్నారు అనే చర్చ సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. ఎందుకంటే ఆ ఫొటోలు షేర్‌ చేసింది వాళ్లిద్దరు కాబట్టి.

మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో తొలుత ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది. అక్కడికి కాసేపటికే అదే లొకేషన్‌కి సంబంధించిన మరొక పోస్ట్ రష్మిక మందన ఇన్‌స్టాలో కనిపించిది. ‘షూటింగ్ ఫర్ సంథింగ్ స్పెషల్’ అని కూడా రాసుకొచ్చింది. దీంతో ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమాలో రష్మిక ఉంది అనే మాటలకు ఊతం ఇచ్చినట్లు అయింది. మరి నిజంగానే రష్మిక ఆ సినిమాలో ఉండదా? ఉంటే ఎలాంటి పాత్ర చేస్తోంది? లేదంటే స్పెషల్‌ సాంగ్‌ ఏమన్నా చేస్తోందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని నిర్మాత దిల్‌ రాజు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఈ మేరకు డేట్‌ కూడా చెప్పేశారు. అయితే ఆ డేట్‌కు ఎక్కువ సినిమాలు ఉండటం, అందులో కొన్నింటి పంపిణీ దిల్‌ రాజే చేస్తుండటంతో ‘ఫ్యామిలీ స్టార్‌’కు మరో డేట్ చూస్తున్నారు అనే టాక్‌ నడుస్తోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus