ప్రేమ పుకార్లకు చెక్ పెట్టిన రష్మిక!

రష్మికా మందన్నాకు బయోపిక్ మీద మనసు మళ్లినట్టు ఉంది. సావిత్రి బయోపిక్ ‘మహానటి’తో కీర్తీ సురేష్ పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో ‘డర్టీ పిక్చర్’, ‘శకుంతలాదేవి’తో విద్యా బాలన్, ‘గుంజన్‌ సక్సేనా’తో జాన్వీ కపూర్, ‘మేరీకోమ్’తో ప్రియాంకా చోప్రా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం జయలలిత బయోపిక్ ‘తలైవి’లో కంగనా రనౌత్ నటిస్తోంది. రష్మిక మాటలు వింటుంటే త్వరలో బయోపిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుంది.

“నేను శ్రీదేవి మేడమ్ బయోపిక్ చెయ్యాలా? సౌందర్య మేడమ్ బయోపిక్ చెయ్యాలా?” అని ప్రేక్షకులను ఒక ప్రశ్న అడిగారు. ఎక్కువశాతం మంది శ్రీదేవి బయోపిక్ చేస్తే బావుంటుందని సూచించారు. రష్మిక సైతం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని చెప్పింది. శ్రీదేవి బయోపిక్ ప్రతిపాదనతో దర్శకులు, నిర్మాతలు వెళితే వెంటనే ఓకే చెప్పేస్తుందేమో. అలాగే, తాను ప్రేమలో ఉన్నానని వస్తున్న పుకార్లకు రష్మిక చెక్ పెట్టింది.

“నా పేరును నాకు తెలిసిన వాళ్లతో ముడిపెడుతున్న వాళ్లందరికీ చెప్పేది ఒక్కటే… నేను సింగిల్. ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడుతున్నాను. సింగిల్‌గా ఉండటాన్ని ఎంజాయ్ చేసేవాళ్లు కాబోయే ప్రేమికుడి కోసం ప్రమాణాలను పెంచుకుంటూ వెళతారు” అని రష్మిక మందన్నా స్పష్టం చేసింది.

1

2

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus