Rashmika Mandanna: పండగనాడు ఇంట్లో ఉండకుండా ఏం చేసిందంటే

సినిమా హీరోయిన్లు అందం అన్నా, ఫిట్‌నెస్‌ అన్నా చాలా ప్రాముఖ్యత ఇస్తుంటారు. అలా ఇవ్వకపోతే ఫిట్‌ లుక్‌లో కాకుండా బబ్లీ లుక్‌లోకి వచ్చేస్తారని అంటుంటారు. గతంలో ఒకరిద్దరు నాయికలు ఇలా బబ్లీ అయిపోయి ఏకంగా సినిమాలకు దూరమైపోయారు. ఇంకొందరు ఇప్పటికీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ చూశారో, లేక స్వతహాగా వచ్చే ఆలోచనో కానీ నేటి తరం నాయికలు వీలైనప్పుడల్లా జిమ్‌లోకి వెళ్లిపోతుంటారు. అలాంటి నాయిక మరొకరు సోషల్‌ మీడియాలో కనిపించారు.

సంక్రాంతిని మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో జరుపుకుంటారు. అలాంటి పండగ రోజు ఎవరు ఎక్కడున్నా సొంతూళ్లకు వెళ్లిపోతుంటారు. దీనికి మన సినిమా నాయికలు కూడా తక్కువేం కాదు. కానీ ఒక నాయిక మాత్రం ఇంటికి వెళ్లకుండా జిమ్‌కి వెళ్లిపోయింది. ఆమెనే శ్రీవల్లి అలియాస్‌ రష్మిక మందన. అవును పండగ నాడు కూడా కసరత్తులు చేయడానికి రష్మిక జిమ్‌కి వెళ్లింది. దానికి సంబంధించి ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో చూస్తే జిమ్‌లో ఆమె ఒక్కర్తే కనిపిస్తోంది. ఫొటో తీసిన వ్యక్తి కూడా ఉన్నాడనుకోండి.

పండగ రోజు జిమ్‌ ఏంటి… అని మీరు అనుకోవచ్చు. కానీ ఫిట్‌నెస్‌ అంటే ప్రాణమిచ్చే హీరోయిన్‌ కాబట్టి వెళ్లిపోయింది. అంతేకాదు… ‘‘ఈ సందర్భంగా నిరూపితమైంది ఏంటంటే… నేను చిన్నపాటి సైకోగా మారిపోయాను. జిమ్‌లోనే జీవితాన్ని గడిపేసే నా లాంటిదాన్ని సైకోనే అంటారు కదా’’ అంటూ ఓ సెల్ఫ్‌ పంచ్‌ కూడా వేసుకొని ఆ ఫొటో కింద రాసుకొచ్చింది. టాలీవుడ్‌లో ఒకప్పుడు బొద్దుగుమ్మలకు ఎక్కువ ఫాలోయింగ్‌ ఉండేది. మన కుర్రాళ్లు అలాంటోళ్లనే ఇష్టపడేవారు.

కానీ ఇటీవల కాలంలో అభిరుచులు మారాయి. స్లిమ్‌గా ఉన్న క్యూటీలంటే ఇష్టపడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన నాయికలు జిమ్‌ల్లో గడుపుతూ సన్నజాజి తీగల్లా మారిపోతున్నారు. ఇంకొందరు ఆ పనిలో ఉన్నారు. ఇప్పుడు రష్మిక కూడా అదే పనిలో ఉంది. తొలి సినిమా నుంచి రష్మిక ఫిగర్‌ను చూస్తే… ఆ విషయం మనకు తెలిసిపోతుంది. తొలినాళ్లలో ఉన్న రష్మికకు ఇప్పటి రష్మికకు పెద్ద తేడా లేకపోయినా గ్లామర్‌ పెరిగిపోతోంది. అంటే రష్మిక అందం జిమ్‌ అని అర్థం చేసుకోవచ్చా. మరి శ్రీవల్లి ఏమంటుందో… సారీ సైకో శ్రీవల్లి ఏమంటుందో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus