రష్మిక బదులు బాలీవుడ్ భామను ట్రై చేస్తున్న చిత్రబృందం

చిరంజీవి ఆచార్య సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో తెలియదు కానీ.. సినిమా షూటింగ్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. మొదట సినిమాలో మహేష్ బాబు ఓ ముఖ్యపాత్ర పోషించే అవకాశాలున్నాయని భారీ స్థాయిలో స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నారు జనాలు. కట్ చేస్తే.. మహేష్ స్థానంలో చరణ్ వచ్చాడు. హీరోయిన్ విషయంలో కూడా అదే జరిగింది. తొలుత చిరంజీవి సరసన త్రిషను ఎంపిక చేశారు. అనంతరం ఆమె సినిమా నుంచి డేట్స్ ఇష్యు కారణంగా బయటకు వచ్చేసింది. తర్వాత ఆమె స్థానంలో కాజల్ ను తీసుకొన్నారు.

ఇక చిరంజీవి ముందే టైటిల్ ను రివీల్ చేయడం, చిరంజీవి లుక్ లీక్ అవ్వడం వంటివి బోనస్ లు. సరే అంతా సెట్ అయ్యింది అనేసరికి కరోనా మొదలైంది. కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది సినిమా మొదలెడదామని బృందం అంతా రెడీ చేసుకుంటున్న తరుణంలో కరోనా పాజిటివ్ అని చిరంజీవి బాంబ్ పేల్చారు. అనంతరం ఆయనే అది నెగిటివ్ అని నిర్ధారించడంతో అభిమానులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ సరసన హీరోయిన్ ఎవరు అనే విషయంలోనూ అదే సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. తొలుత కియారా, అను ఇమ్మాన్యూల్ వంటి వారి పేర్లు .వినిపించినప్పటికీ.

చివరికి మాత్రం రష్మిక ఆ అవకాశం చేజిక్కించుకొందని కథనాలు వెలువడ్డాయి. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా రశ్మికను కన్సిడర్ చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ.. ఆమెను ఫైనల్ చేయలేదని, హిందీ శాటిలైట్ & డబ్బింగ్ రైట్స్ కి పనికొచ్చేలా ఒక బాలీవుడ్ హీరోయిన్ కోసం చిత్రబృందం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరు అనేది బృందం వెల్లడించనుంది. దీంతో చరణ్ సరసన రష్మిక అనే గాసిప్ పై నీళ్లు జల్లినట్లే.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus