Rashmika Mandanna: పుష్ప సీక్వెల్ పై రష్మిక షాకింగ్ కామెంట్స్!

పుష్ప ది రైజ్ అంచనాలకు మించి సక్సెస్ సాధించినా ఈ సినిమాలో కొన్ని పొరపాట్లు అయితే ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను పుష్ప ది రైజ్ ఆకట్టుకోలేదనే కామెంట్లు వినిపించాయి. అయితే కలెక్షన్ల విషయంలో పుష్ప ది రైజ్ నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను, బయ్యర్లను నిరాశపరచలేదు. పుష్ప ది రైజ్ సినిమాలో రష్మిక మందన్న, సునీల్, రావు రమేష్, అనసూయ పాత్రల నిడివి తక్కువగానే ఉండటం గమనార్హం. అయితే ఈ సినిమా గురించి తాజాగా రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పుష్ప ది రైజ్ సినిమా మాస్ ఫీస్ట్ అని ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని రష్మిక అన్నారు. పుష్పరాజ్ ఫైర్ ఏ మాత్రం తగ్గలేదని రష్మిక కామెంట్లు చేశారు. ప్రస్తుతం అందరి దృష్టి పుష్ప ది రూల్ పై ఉందని రష్మిక చెప్పుకొచ్చారు. పుష్ప ది రూల్ మరింత బెటర్ గా, మరింత బిగ్గర్ గా ఉంటుందని రష్మిక కామెంట్లు చేశారు. రష్మిక చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. పుష్ప ది రూల్ కూడా అంచనాలను మించి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

సుకుమార్ రెండో భాగంలో ఆసక్తికర ట్విస్టులు ఉండేలా జాగ్రత్త పడుతున్నారని సమాచారం. సుకుమార్ ప్రస్తుతం పుష్ప ది రూల్ పనులతో బిజీగా ఉన్నారు. తొలి భాగంలో కనిపించని మూడు పాత్రలు పుష్ప ది రూల్ లో కనిపిస్తాయని సమాచారం. కేశవ పాత్రతో సుకుమార్ షాకింగ్ ట్విస్ట్ ను ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తెలుగులో ఫస్ట్ పార్ట్ సక్సెస్ సాధించనంతగా రెండో పార్ట్ సక్సెస్ సాధించిన సినిమాలు ఎక్కువగా లేవు.

బాహుబలి సిరీస్ మాత్రమే రెండో భాగం కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించింది. అయితే పుష్ప ది రూల్ తో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆ నెగిటివ్ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ ఏడాదే పుష్ప ది రూల్ రిలీజయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus