కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తాను : రష్మిక మందన

  • March 27, 2020 / 01:32 PM IST

రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోతుంది. ఈ ఏడాది ఇప్పటికే ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ లు అందుకుంది. ఇప్పుడు టాలీవుడ్ అగ్ర దర్శకులకందరికీ బెస్ట్ చాయిస్ గా మారిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘శేషాచలం'(వర్కింగ్ టైటిల్) లో హీరోయిన్ గా నటిస్తుంది ఈ బ్యూటీ.

ఇక తమిళంలో కార్తీ తో ‘సుల్తాన్’ అనే చిత్రం కూడా చేస్తూనే కన్నడంలో కూడా ఓ చిత్రం చేస్తూ చాలా బిజీగా గడుపుతుంది. ఇదిలా ఉండగా … ఈమె సూపర్ హిట్ అయిన ‘జెర్సీ’ చిత్రంలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసిందట. అయితే తెలుగులో కాదులెండి… అదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరినే హిందీలో కూడా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఈ రీమేక్ లో హీరో గా షాహిద్ కపూర్ నటిస్తుండగా … హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. మొదట ఈ ఛాన్స్ రష్మిక కు వచ్చిందట. కానీ ఆమె రిజెక్ట్ చేసిందట. ‘నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాల వల్లే ఈరోజు ఇలా ఉన్నాను… నన్ను అందరికీ దగ్గర చేసే కమర్షియల్ సినిమాలే నేను చేస్తాను. అలా అని ‘జెర్సీ’ చిత్రాన్ని తక్కువగా చూస్తున్నా అని అనుకోకండి..!’ అంటూ ఈ చిత్రం ఎందుకు చెయ్యలేదో చెప్పుకొచ్చింది రష్మిక..!

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus