Rashmika: బాలీవుడ్‌ కలసిరాని లిస్ట్‌లో రష్మిక.. ఏం చేస్తుందో..!

పట్టిందల్లా బంగారం.. ఈ అదృష్టం చాలా తక్కువమందికి వస్తుంటుంది. అంటే.. ఏ సినిమా ఎంచుకున్నా పక్కాగా విజయం అందుకుంటుంది అని అనిపిస్తేనే ఈ మాట అంటారు. ఇటీవల కాలంలో ఇలాంటి పిలుపు అందుకున్న కథానాయిక రష్మిక మందన. తెలుగులో ‘గీతా మేడమ్‌’గా స్టార్‌ హీరోయిన్‌ రేంజికి అడుగులు వేసిన రష్మిక ఆ తర్వాత ‘శ్రీవల్లి’ అంటూ దూసుకుపోయింది. ఆ వెంటనే బాలీవుడ్‌వైపు అడుగులు వేయడంతో.. క్రష్మిక అని పిలుచుకున్నారు అభిమానులు.

అయితే ఇప్పుడు నేషనల్‌ క్రష్‌ మళ్లీ సౌత్‌ క్రష్‌గా మారబోతోందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. టైమ్‌.. టైమ్‌.. టైమ్‌.. సినిమా తారల ఫేమ్‌, క్రేజ్‌కి ఇది చాలా కీలకం. ఎంత పక్కాగా ప్లాన్‌ చేసినా టైమ్‌ బాగోకపోతే.. అనుకున్నట్లుగా సాగవు. రష్మిక పరిస్థితి కూడా ఇదే అంటున్నారు. సౌత్‌లో చాలా తక్కువ సమయంలో వరుస విజయాలతో నేషనల్‌ క్రష్‌ స్థాయికి వెళ్లిపోయింది. దీనికి ఆమె ఆఫ్‌స్క్రీన్‌ రిలేషన్స్‌, బ్రాండ్స్‌ లాంటివి కారణాలు కావొచ్చు.

అయితే ఈ క్రమంలో ఆమె సంపాదించిన బాలీవుడ్‌ సినిమాలు సరైన విజయం అందుకోకపోవడంతో రష్మిక బాలీవుడ్‌ సినిమాలపై పునరాలోచన పడింది అని అంటున్నారు. అయితే రష్మిక హిందీ కెరీర్‌ గురించి అప్పుడే ఓ నిర్ణయానికి రాలేం. ఎందుకంటే ఆమె నుండి ఇంకా ఎక్కువ సినిమాలు రాలేదు. అదే సమయంలో ఇంకా పెద్ద సినిమాలు ఆమె నుండి రావాల్సి ఉంది. కాబట్టి రష్మిక సౌత్‌కి యూటర్న్‌ తీసేసుకుంటుంది అని అప్పుడే చెప్పలేం.

ప్రస్తుతం రష్మిక చేతుల్లో ‘మిషన్‌ మజ్ను’, ‘యానిమల్‌’ ఉన్నాయి. తొలి సినిమా ఓటీటీలోకి వస్తోంది, అందులోనూ పెద్ద హీరో కాదు, రెండో సినిమా రణ్‌బీర్‌ కపూర్‌ సినిమా. ఈ సినిమా తేడా కొడితే అప్పుడే కచ్చితంగా క్రష్మిక కేవలం సౌత్‌కే పరిమితం అవుతుంది అని చెప్పొచ్చు. ఇక సౌత్‌ సంగతి చూస్తే.. ఆమె విజయ్‌తో కలసి నటించిన ‘వరిసు’ /‘వారసుడు’ సంక్రాంతికి తీసుకొస్తున్నారు. ఇది కాకుండా ‘పుష్ప 2’ ఉంది. దీంతోపాటు ఇప్పటికిప్పుడు ఆమె సౌత్‌కి వచ్చేస్తే.. పెద్ద అవకాశాలే వస్తాయి అని చెప్పొచ్చు. మరి రష్మిక ఏం చేస్తుందో చూడాలి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus