Rashmika, Pooja Hegde: విజయ్‌ సినిమాలో హీరోయిన్‌ తొలుత రష్మిక కాదట!

‘బీస్ట్‌’ సినిమాలో పూజా హెగ్డే ఉంది కానీ… లేనట్లే ఉంది అంటూ ఈ మధ్య పుకార్లు వస్తున్నాయి. కారణం సినిమా నేపథ్యం, మొన్నీమధ్య వచ్చిన ట్రైలర్‌లో ఆమెకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. దీంతో విజయ్‌తో పూజను చూసి మురిసిపోదాం అనుకున్నవారికి నిరాశ ఎదురైంది. అయితే వాళ్ల సరదా తీరేలా విజయ్‌, పూజ మరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ పూజ వల్లే ఆ అవకాశం పోయింది. ఈ విషయం మేం కాదు నిర్మాత దిల్‌ రాజే చెప్పారు.

విజయ్‌ – వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో #థళపతి66 వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ముహూర్తం కూడా జరుపుకుంది. ఈ సినిమా కథానాయికగా రష్మిక మందన నటిస్తోంది అని తొలుత వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత రష్మిక తప్పుకుందని, ఆమె స్థానంలో మరోఒ హీరోయిన్‌ను తీసుకుంటున్నారు అని వార్తలొచ్చాయి. అయితే పూజా హెగ్డే తప్పుకోవడం వల్లే రష్మిక ఆ సినిమాలోకి వచ్చిందట. ‘బీస్ట్‌’ సినిమా ప్రచారంలో భాగంగా దిల్‌ రాజు ఇటీవల పూజా హెగ్డే, దర్శకుడ నెల్సన్‌ దిలీప్‌తో ఇంటర్వ్యూ చేశారు.

ఈ క్రమంలో ఈ విషయం చెప్పేశారు. విజయ్‌తో మేం చేస్తున్న నెక్స్ట్‌ సినిమాలో నిన్నే హీరోయిన్‌గ పెట్టుకుందాం అనుకున్నాం. కానీ నీ డేట్స్‌ పరిస్థితులు, డేట్స్‌ కుదరక రష్మికను తీసుకున్నాం అని చెప్పారు. దీంతో అవునా, ఇంత జరిగిందా అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారు క్రష్మిక అభిమానులు. దిల్‌ రాజుకు పూజా చాలా లక్కీ. ఆమెతో చేసిన వరుస సినిమాలు విజయాలు అందుకుంటున్నాయి. అందుకే ఆమెను దిల్‌ రాజు ‘పూజా మన కాజా’ అంటూ పొగిడేశారు.

విజయ్‌ 66వ సినిమాలో పూజాను తీసుకుందామని అందుకే అనుకున్నారు. కానీ ఇప్పుడు మన ‘బాజా’ రష్మిక వచ్చిందన్నమాట. ఇదేంటి ‘బాజా’ అనుకుంటున్నారా. సినిమా చేసే ప్రతి హీరోను పొగుడుతూ బాజా కొట్టడం ఆమెకు అలవాటుగా మారిందని సోషల్‌ మీడియాలో అంటుంటారు లెండి. మొన్నీ మధ్య ముహూర్తంలో దిష్టి తీయడం లాంటి కార్యక్రమాలు జరిగాయి కదా.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus