Rashmika: ‘పుష్ప 2’ సీజన్‌.. ‘పుష్ప 1’ను గుర్తు చేసుకున్న రష్మిక మందన.. ఫొటోలతో..!

‘పుష్ప’  (Pushpa) సినిమాకు సంబంధించి ఇప్పటివరకు చాలా ఫొటోలు బయటకు వచ్చాయి. సినిమా వచ్చాక ఆన్‌ సెట్స్‌ ఫొటోలు, వీడియోలు రిలీజ్‌ చేశారు. అలా వచ్చిన వాటిలో లేని కొన్ని అన్‌సీన్‌ పిక్స్‌ని శ్రీవల్లి అలియాస్‌ రష్మిక మందన (Rashmika Mandanna)  తాజాగా షేర్‌ చేసింది. గత కొన్ని రోజులుగా సినిమా టీమ్‌ను వదిలి వెళ్తున్నందుకు బాధపడుతున్న రష్మిక వరుస బాధపడుతూ వరుస పోస్టులు పెడుతోంది. ఈ క్రమంలో ‘పుష్ప 1’ డైరీస్‌ అంటూ పాత ఫొటోలను అప్‌లోడ్‌ చేసింది.

Rashmika

డిసెంబరు 5న ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2)  సినిమా బాక్సాఫీసు ముందుకు రానుంది. ట్రైలర్‌ను పట్నాలో ఈ నెల 17న రిలీజ్‌ చేస్తారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 1’ జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నా. సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ నేను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకొని కొన్ని ఫొటోలను ఇప్పుడు పోస్ట్‌ చేస్తున్నా అంటూ కొన్ని ఇంట్రెస్టింగ్‌ ఫొటోలను షేర్‌ చేసింది.

అందులో శ్రీవల్లి పాత్ర లుక్‌ టెస్ట్‌ ఫొటో, రష్యాలో అల్లు అర్జున్‌తో (Allu Arjun)  కలిసి దిగిన స్టిల్‌, దర్శకుడు సుకుమార్‌  (Sukumar), నిర్మాతలతో కలసి దిగిన ఫొటోలు ఉన్నాయి. అలాగే ‘నా సామి..’ పాట మేకింగ్‌ వీడియో కూడా ఉంది. ఈ క్రమంలో తన పాత్ర వెనుక జరిగిన ఓ విషయాన్ని కూడా చెప్పింది. ఆ క్యారెక్టర్‌ కోసం తిరుపతి వెళ్లి కొంత రీసెర్చ్‌ చేశామని రష్మిక తెలిపింది. శ్రీవల్లి పాత్ర కోసం కాస్ట్యూమ్స్‌, మేకప్‌తో సిద్ధమవుతున్న ఫొటోను కూడా షేర్‌ చేసింది.

ఇక ‘పుష్ప 2’ గురించి చూస్తే.. పట్నాలోని గాంధీ మైదాన్‌లో ఈ నెల 17న ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. ట్రైలర్‌ను అదే రోజు సాయంత్రం 6:03 గంటలకు డిజిటల్‌ రిలీజ్‌ చేస్తారు. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లో రిలీజ్‌ చేస్తారు. ఈ స్థాయిలో ఓ తెలుగు సినిమా విడుదలవ్వడంతో ఇదే తొలిసారి అని అంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus