Tabu: టబునే ఫాలో అవుతున్న ప్రియాంక చోప్రా, రష్మిక?

సినీ పరిశ్రమలో హీరోయిన్ల లైఫ్ టైం చాలా తక్కువ. ఇది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా మందికి తెలిసిన సంగతే. అందుకే హీరోయిన్లు ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే ఉద్దేశంతో ప్రతి ఆఫర్ కి ఓకే చెప్పేస్తూ ఉంటారు. ఈ క్రమంలో హిట్లు వస్తే ఓకే.. లేదు అంటే త్వరగానే ఫేడౌట్ అయిపోతారు.

 

Tabu

ఆ తర్వాత ఏ ఆఫర్ వస్తే ఆ ఆఫర్ కి ఓకే చెప్పాల్సి వస్తుంది. అటు తర్వాత కూడా ఆఫర్ల కొరత వస్తే.. పెళ్లిళ్లు చేసుకుని సినిమాలకు దూరం అవుతారు. ఆ పరిస్థితి రాకుండానే కొంతమంది స్టార్ హీరోయిన్లు తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరుస ఆఫర్లు వస్తున్నప్పటికీ కొంతమంది స్టార్ హీరోయిన్లు విలన్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఆమె ఈ సినిమాలో నెగిటివ్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. ఈ పాత్ర సినిమాకే హైలెట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా రూ.20 కోట్లు పారితోషికం అందుకుంటుంది. మరోపక్క అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో కూడా పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో రష్మిక నెగిటివ్ రోల్ పోషిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం రష్మిక సూపర్ ఫామ్లో ఉంది. అయినప్పటికీ ఇలాంటి పాత్ర ఎంపిక చేసుకోవడం రిస్క్ అనే చెప్పాలి. అయితే దీని వెనుక మరో కారణం కూడా ఉంది. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేస్తే.. హీరోయిన్ల ఓటీటీ మార్కెట్ డెవలప్ అవుతుంది. ప్రియమణి ఇలాగే ఓ ట్రెండ్ సెట్ చేసింది. వీళ్ళందరికీ స్ఫూర్తి టబు అనే చెప్పాలి. హీరోయిన్ గా డిమాండ్ తగ్గిన తర్వాత టబు ‘అంధాదున్’ వంటి సినిమాల్లో టబు నెగిటివ్ రోల్ చేసింది. దాని వల్ల ఆమె ఓటీటీ మార్కెట్ బాగా పెరిగింది. ప్రస్తుతం ఈమె పూరి- విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తుంది. ఇందులో కూడా ఆమె చేస్తుంది నెగిటివ్ రోల్. ఈ పాత్ర కోసం ఆమె ఏకంగా కోటి పారితోషికం అందుకుంటున్నట్టు సమాచారం.

 

ఏజ్‌ గ్యాప్‌.. రప్పా రప్పా ఇచ్చి పడేసిన శ్రుతి హాసన్‌.. ఏమందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus