Shruti Haasan: ఏజ్‌ గ్యాప్‌.. రప్పా రప్పా ఇచ్చి పడేసిన శ్రుతి హాసన్‌.. ఏమందంటే?

శ్రుతి హాసన్‌ చాలా బేస్‌ వాయిస్‌ ఉన్న పర్సన్‌. అది మాట సౌండ్‌లోనే కాదు.. మాటలోని కరుకుతనంలో కూడా ఉంటుంది అని చెప్పొచ్చు. ఆమె కొన్ని విషయాల మీద రియాక్ట్‌ అయ్యే విధానం చూస్తే ఎవరైనా ఇదే మాట అంటారు. తాజాగా ఆమె ఇండియన్‌ సినిమా ట్రెండింగ్‌ టాపిక్‌ హీరో హీరోయిన్ల ‘ఏజ్‌ గ్యాప్‌’ గురించి మాట్లాడింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాయి. ఏజ్‌ గ్యాప్‌ గురించి తానేం అనుకుంటున్నది అనేది చెప్పడంతోపాటు.. అసలు ఈ టాపిక్‌ చర్చకు అవసరమా అనేలా ప్రశ్నించింది కూడా.

Shruti Haasan

‘థగ్ లైఫ్’ సినిమాలో కమల్ హాసన్, త్రిష కాంబినేషన్‌, ఇద్దరి మధ్య వచ్చిన రొమాంటిక్ సీన్స్ గురించి సోషల్ మీడియాలో, మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అలా ఎలా ఇద్దరి మధ్య అలాంటి సీన్స్‌ పెడతారు అంటూ అందరూ ప్రశ్నించారు. ఆఖరికి ఆ సినిమా దర్శకుడు మణిరత్నం స్పందిస్తూ ‘మీరు రెండు పాత్రలనే చూడండి. కమల్‌ హాసన్, త్రిషని ఎందుకు చూస్తున్నారు. ఆ ఏజ్ గ్యాప్ రిలేషన్‌షిప్‌లు మన సొసైటీలో చాలానే ఉన్నాయి. సొసైటీలో ఉన్న పాత్రలనే తెరమీద చూపించాం” అని చెప్పాల్సి వచ్చింది.

ఇప్పుడు ఇదే ప్రశ్న శ్రుతి హాసన్‌ దగ్గర ప్రస్తావిస్తే.. మరింత ఘాటైన సమాధానం ఇచ్చింది. ‘‘ఏజ్ గ్యాప్‌ సంగతి పట్టించుకోను. మాట్లాడుకునే వాళ్లు బోలెడు మాట్లాడుకుంటారు. నా వరకు నాకు వచ్చిన పాత్ర చేయడమే తెలుసు. నేను నా దగ్గరకు వచ్చిన పాత్రనే చూస్తాను తప్ప.. ఆ పాత్రల ఏజ్‌ ఎంత, నటుల మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఎంత అనేది చూడను” అని స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చింది.

ఇక శ్రుతి సినిమాల సంగతి చూస్తే.. ఆమె నటించిన ‘కూలీ’ సినిమా ఆగస్టు 14న విడుదలవుతోంది. ఇందులో శ్రుతి కోసం దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ బలమైన పాత్ర రాశారట. హీరోలు రజనీకాంత్, ఆమిర్‌ ఖాన్‌, ఉపేంద్ర, నాగార్జునకు పోటాపోటీగా ఆ పాత్ర ఉంటుంది అని చెబుతున్నారు.

‘హరి హర వీరమల్లు’ నుండి క్రిష్‌ ఎందుకు బయటకొచ్చారు? ఇదిగో క్లారిటీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus