Rashmika: నేషనల్ క్రష్ ఖాతాలో ఉన్న ఈ రికార్డ్స్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక (Rashmika Mandanna) ఈరోజు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. రష్మిక బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తున్న పుష్ప ది రూల్ (Pushpa 2: The Rule) , ది గర్ల్ ఫ్రెండ్ సినిమాల నుంచి పోస్టర్లు రిలీజ్ కాగా ఆ పోస్టర్లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నేషనల్ క్రష్ రష్మిక ఖాతాలో ఎన్నో రికార్డ్స్ ఉండగా ఆమె సాధించిన రికార్డులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కిర్రాక్ పార్టీ సినిమాతో రష్మిక సినీ కెరీర్ మొదలు కాగా ఛలో (Chalo) సినిమాతో తెలుగులో రష్మిక ప్రయాణం మొదలైంది.

నేషనల్ క్రష్ గా గుర్తింపును సొంతం చేసుకున్న రష్మిక గీతా గోవిందం (Geetha Govindam) , పుష్ప ది రైజ్ (Pushpa: The Rise) సినిమాల్లోని పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. యానిమల్ సినిమాతో రష్మిక ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరిందనే సంగతి తెలిసిందే. పారితోషికం విషయంలో సైతం రష్మిక టాప్ లో ఉన్నారు. రష్మిక కొన్నిరోజుల క్రితం టోక్యోలో జరిగిన క్రంచీ రోల్ అనిమే అవార్డుల వేడుకకు హాజరయ్యారు.

ఈ అవార్డ్ వేడుకకు హాజరైన తొలి సెలబ్రిటీ రష్మిక కావడం గమనార్హం. జపాన్ కు చెందిన ఒనిట్సుకా టైగర్ ఫ్యాషన్ బ్రాండ్ కు రష్మిక బ్రాండ్ అడ్వకేట్ గా వ్యవహరించారు. ఈ సంస్థకు బ్రాండ్ అడ్వకేట్ గా ఎంపికైన తొలి భారతీయురాలు రష్మిక కావడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో సైతం రష్మికకు స్థానం దక్కింది.

నెదర్లాండ్స్ కు చెందిన సెప్టిమిస్ అవార్డ్స్ నామినేషన్స్ లో మన దేశం నుంచి రష్మిక నిలిచారు. సోషల్ మీడియాలో రష్మికకు ఏకంగా 43 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తొలి సినిమాతోనే రష్మిక సైమా అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. పుష్ప2 సినిమాతో రష్మిక మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus