హీరోయిన్లు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించడం కామన్. మరీ ముఖ్యంగా తమ సినిమాలు రిలీజ్..లు ఉంటే కచ్చితంగా అభిమానులతో చిట్ చాట్ సెషన్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇది అంత ఆర్గానిక్ గా జరగదు. ‘ఆస్క్(హీరోయిన్)’ అంటూ నిర్వహించే సెషన్లలో చాలా మంది నెటిజన్లు పాల్గొంటారు . ఆ హీరోయిన్ ఫాలోవర్స్ యాక్టివ్ గా ప్రశ్నలు అడుగుతారు. కానీ హీరోయిన్స్ టీం ఏర్పాటు చేసిన బ్యాచ్..లకు మాత్రమే వాళ్ళు సమాధానాలు చెబుతారు అనేది ఇన్సైడ్ టాక్.
హీరోయిన్లు కూడా వాళ్ళతోనే తమకు కావాల్సిన ప్రశ్నలు అడిగించుకుని సమాధానాలు చెబుతుంటారు అని కూడా ఎక్కువగా వినిపించే సమాధానం. ఇదిలా ఉంటే.. తాజాగా రష్మిక తన గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన సోషల్ మీడియా ఫాలోవర్స్ తో ముచ్చటించింది. ఈ క్రమంలో ‘కొంచెం తొందరగా ఉంది. అందుకే అడిగేస్తున్నా..! వచ్చే 400-500 ఏళ్ల వరకు నా వాలెంటైన్‌గా ఉంటావా?’ అంటూ ఓ నెటిజన్ రష్మికకి ఫన్నీ క్వశ్చన్ వేశాడు. దీనికి రష్మిక ఒక్కసారిగా షాక్ అయ్యింది. తర్వాత తనదైన శైలిలో ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. “ఈ 100 ఏళ్ళు కష్టం.
కానీ 100 ఏళ్ళ తర్వాత మనం ఉంటే ఆలోచిద్దాం” అంటూ ఎమోషనల్ కామెంట్స్ తో కూడిన ఎమోజీని షేర్ చేసింది. ఈ సరదా డిస్కషన్ ఇప్పుడు వైరల్ అవుతుంది. రష్మిక ఎప్పుడూ చాలా హుషారుగా ఉంటుంది. సినిమా సెట్స్ లో కూడా అంతే హుషారుగా ఉంటూ పనిచేస్తుంది అని చాలా మంది చెబుతుంటారు. మరి సోషల్ మీడియాలో ఈ మాత్రం ఫన్నీగా ఉండదా చెప్పండి.