Rashmika: తనని బ్యాన్ చేశారంటూ వస్తున్న వార్తల పై స్పందించిన రష్మిక!

రష్మిక మందన.. 2018 లో టాలీవుడ్ లో అడుగుపెడితే 2020 కే స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2022 నాటికి హిందీలో కూడా క్రేజ్ సంపాదించుకుని నేషనల్ క్రష్ అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరు. కన్నడ బ్యూటీ అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్ అయ్యింది. అయితే ఈ మధ్య కాలంలో ఆమెను కన్నడిగులు బ్యాన్ చేసినట్టు టాక్ నడిచింది.

అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇటీవల కాంతార మూవీ రిలీజ్ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అందుకుంది. ఈ మూవీని చూసిన సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ రష్మిక మాత్రం ఆ సినిమా గురించి స్పందించలేదు. నిజానికి ఆమెను నటిని చేసింది రక్షిత్ శెట్టి.. ! కిరిక్ పార్టీ సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇప్పుడు స్టార్ అవ్వడంతో ఆ రోజులను రష్మిక మర్చిపోయిందని, ఆమెకు విధేయత లేదని కన్నడ జనాలు ఈమెను నిషేదించాలని కోరుతున్నట్టు మండిపడ్డారు.

అయితే ఈ కామెంట్స్ రష్మిక ఖండించింది. నటీనటుల మధ్య ఉండే వ్యవహారాలు జనాలకు తెలీదు. కాంతార సినిమా చూసి నేను టీమ్ కు కంగ్రాట్స్ అంటూ మెసేజ్ పెట్టాను. నా వ్యక్తిగత జీవితాలను కెమెరా పెట్టి చూపించలేను.నాపై ఎటువంటి నిషేధం లేదు.ఉంది అనుకుని భ్రమపడేవారు ఉంటే అది వాళ్ళ అభిప్రాయం అనుకోవాలి అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus