మెగా కోడలు ఉపాసన ‘యువర్ లైఫ్’ అనే షోని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ షోకి రష్మిక గెస్ట్ ఎడిటర్ గా ఉంటూ పలు రకాల పోషకార వంటలను పరిచయం చేస్తున్నారు. తాజాగా చికెన్ పుట్టు కర్రీ అనే వంటకం తయారీ చేసి ఉపాసనకు రుచి చూపించారు. రష్మిక వంటకానికి వంద మార్కులు వేసిన ఉపాసన.. నటిగానే కాకుంగా చెఫ్ గా కూడా రాణిస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ వీడియోలో రష్మిక తన సామాజిక వర్గం గురించి మాట్లాడారు.
తాను కోర్గి అనే సామాజిక వర్గానికి చెందిన అమ్మయినని రష్మిక చెప్పారు. కోడిని కోర్గి భాషలో కోలి అంటారని చెప్పే క్రమంలో రష్మిక తన సామాజిక వర్గం గురించి ప్రస్తావించింది. దీంతో ఉపాసన.. ‘కోర్గి సామాజిక వర్గానికి చెందిన వారు పంది మాంసం ఎక్కువగా తింటారు కదా..?’ అని ప్రశ్నించింది. దానికి రష్మిక అవునని సమాధానమిచ్చింది. పంది మాసం తమ సంప్రదాయ వంటకమని.. నిప్పులపై కాల్చి తింటామని.. నిజానికి పంది మాంసం, వైన్ తో చాలా చేస్తామని అన్నారు.
వైన్ ను ఇంట్లోనే తయారు చేసుకుంటామని.. ప్రతికోర్గి ఇంట్లో పడుకునే ముందు రెండు కప్పులు లేదా.. రెండు పెగ్ లు వైన్ తాగుతారని.. దీనివలన నిద్ర బాగా పడుతుందని.. అలానే గుండెకు చాలా మంచిదని చెప్పుకొచ్చారు. రష్మిక కొడగు జిల్లాలో ఉన్న విరాజ్‌పేట్ పట్టణంలో పుట్టారు. ఈ జిల్లాలో కోర్గి వర్గానికి చెందిన ప్రజలు జీవిస్తుంటారు. ఇక్కడ ప్రజలకు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. వీరి ఇంట్లో ఎలాంటి వేడుక జరిగినా.. పంది మాంసం, వైన్ ఉండాల్సిందేనట.
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?