Rashmika Mandanna: ఆ వ్యక్తి టార్చర్ చేశాడంటున్న రష్మిక!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో రష్మిక మందన ఒకరు కాగా పుష్ప మూవీతో రష్మిక ఖాతాలో మరో సక్సెస్ చేరింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్న రష్మిక బాలీవుడ్ సినిమాలలో కూడా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు. తాజాగా రష్మిక మందన జిమ్ ట్రైనర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్మిక జిమ్ ట్రైనర్ కుల్దీప్ సేతి కాగా కుల్దీప్ పుష్ప సినిమాలోని సామిసామి పాటకు స్టెప్పులు వేయడానికి ట్రై చేశారు.

అయితే కుల్దీప్ సామీ సామీ పాటకు స్టెప్పులు వేయడం గురించి రష్మిక స్పందిస్తూ తనను కుల్దీప్ వర్కౌట్లు సరిగ్గా చేయాలని చెబుతూ ట్రైనింగ్ సెషన్ సమయంలో టార్చర్ చేస్తాడని అయితే కుల్దీప్ సామీ సామీ పాటకు ఈ విధంగా స్టెప్పులు వేస్తాడని తాను ఊహించలేదని రష్మిక వెల్లడించారు. ఈ విధంగా స్టెప్పులు వేస్తాడని తెలిస్తే సామీ సామీ పాట స్టెప్పులను నేర్పించి తాను పగ తీర్చుకునేదానినని ఆమె అన్నారు. రష్మిక మందన చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రష్మిక సామీ సామీ పాటకు వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలో కూడా పుష్ప మూవీ ఊహించని స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం ఈ సినిమా ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితం కావడం లేదు. రష్మిక మందనకు పుష్ప సక్సెస్ వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది.

రష్మిక తన జిమ్ ట్రైనర్ మీద వేసిన సెటైర్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రష్మిక మందన ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సక్సెస్ లో ఉన్నా ఈ హీరోయిన్ పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండటం గమనార్హం. హిందీలో కూడా రష్మిక నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తే రష్మిక అక్కడ కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus