Sivakarthikeyan, Rashmika: ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ కి ఓకే చెప్తుందా..?

‘జాతిరత్నాలు’ సినిమాతో ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అనుదీప్ తన తదుపరి సినిమాను హీరో శివ కార్తికేయన్ తో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఏషియన్ గ్రూప్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం శివ కార్తికేయన్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ స్టార్ రష్మికను ఎంపిక చేసుకోవాలని చూస్తున్నారు.

‘సుల్తాన్’ సినిమాతో కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఈ సినిమా అక్కడ మంచి హిట్ అందుకుంది. రష్మికను హీరోయిన్ గా తీసుకుంటే ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ వస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అమ్మడు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. తెలుగులో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది.

అలానే శర్వానంద్ నటిస్తోన్న ‘ఆడాళ్లు మీకు జోహార్లు’లో హీరోయిన్ గా ఆమెనే తీసుకున్నారు. వీటితో పాటు బాలీవుడ్ లో ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ లాంటి సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్ గానే అమ్మడు ముంబైలో ఇల్లు కూడా తీసుకుంది. ఫ్యూచర్ లో మరిన్ని బాలీవుడ్ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తుంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus