చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టు.. రష్మిక పేరు చెప్పుకుని కన్నడ డబ్బింగ్ చిత్రమైన ‘పొగరు’ని తెలుగు రాష్ట్రాల్లో బాగానే అమ్మేసారు. అర్జున్ మేనల్లుడు అయిన ధృవ్ షార్జా హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నంద కిషోర్ డైరెక్ట్ చెయ్యగా.. డి.ప్రతాప్ నిర్మించారు.చందన్ శెట్టి, అర్జున్ జన్యలు సంగీతం సమకూర్చారు. ‘కరాబు మైండు కరాబు’ అనే ఒక్క పాట.. ఈ సినిమా పై అందరి దృష్టి పడేలా చేసింది. ఇక రష్మిక కూడా హీరోయిన్ కావడంతో..
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. వాటి వివరాలను ఓ సారి గమనిస్తే :
నైజాం | 1.60 cr |
సీడెడ్ | 0.40 cr |
ఉత్తరాంధ్ర | 1.70 cr |
ఏపీ+తెలంగాణ (టోటల్) | 3.70 cr |
‘పొగరు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.7కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫిబ్రవరి 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది కాబట్టి.. మరో 4 సినిమాలతో పోటీ పడాలి. ‘చక్ర’ ‘కపటదారి’ ‘నాంది’ వంటి క్రేజీ చిత్రాలు అదే రోజున విడుదల కాబోతున్నాయి. ఇక ‘ఉప్పెన’ చిత్రం కూడా చాలా స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. కాబట్టి.. ఈ టైములో బ్రేక్ ఈవెన్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. చూడాలి మరి ఇది ఏ స్థాయిలో కలెక్ట్ చేస్తుందో.!
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?