Bigg Boss 7 Telugu: శివాజీ ఆ మాట చెప్పాడనే రతిక రెచ్చిపోయిందా ? లైవ్ లో ఏం జరిగిందంటే.,

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం నామినేషన్స్ లో రతిక రెచ్చిపోయింది. పిచ్చి పట్టినదానిలా అరుస్తూ ప్రియాంక ఇంకా శోభాశెట్టి ఇద్దరిపై అరిచింది. అయితే, నామినేషన్స్ కంటే ముందు శివాజీ రతికతో చాలాసేపు మాట్లాడాడు. నీ గేమ్ అంతా బాగుంది కానీ భయం అనేది వదిలేయ్ మని చెప్పాడు. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదని అన్నాడు. రాజమాతల అప్పుడు కూడా నువ్వు ఆగిపోయావ్ అని, అప్పుడు మాట్లాడాల్సి ఉంది అని హితబోధ చేశాడు. ఇక నామినేషన్స్ అప్పుడు పాత రతికని గుర్తు చేసుకోమని అన్నాడు. ఉడత ఉడత ఊచ్.., పాట వచ్చినపుడు నీ బ్రైయిన్ ఎంత బాగా పనిచేసిందో అలాంటి రతికని బయటకి తీస్కుని రమ్మని చెప్పాడు.

దీంతో నామినేషన్స్ లో రెచ్చిపోయింది రతిక. సీరియల్ బ్యాచ్ అని బయట ముద్ర పడి నెగిటివిటీని మూట గట్టుకున్న శోభా అండ్ ప్రియాంక ఇద్దరిపైనా మాటల యుద్దం చేసింది. మద్యలో నాగార్జున హోస్ట్ మాత్రమే అని హౌస్ మేట్ కాదు, ప్రతి సారి నీకు వచ్చి చెప్పడానికి అని ప్రియాంకకి చెప్పింది. అలాగే, రాజమాతలుగా ఉన్నప్పుడు మీరు డెసీషన్ లో రాంగ్ తీస్కున్నారని, మాకు మాట్లాడే అవకాశం కుడా ఇవ్వలేదని చెప్పింది. అశ్విని తో ప్రవర్తించిన విధానం ఆ అమ్మాయిని ఏడిపించిన తీరు బాలేదని చెప్పింది. అయితే, తను కూడా రాజమాతగా పక్కనే ఉందనే విషయాన్ని మర్చిపోయింది. అశ్విని ఏడుస్తుంటే కనీసం అక్కడికి వెళ్లి ఆమెకి సపోర్టింగ్ గా నిలవలేదు.

అలాగే, చాక్లెట్ ఇస్తూ నేను టాక్సిసిటీ అన్నావ్ అని, అన్ వర్తీ అన్నావని గుర్తు చేసింది. అలాగే ప్రతిసారి నీకోసం బిగ్ బాస్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వడంటూ రెచ్చిపోయింది. ఆ తర్వాత ప్రియాంక తిరిగి రతికని నామినేట్ చేస్తున్నా కూడా రెచ్చిపోయి మరీ ఆర్గ్యూమెంట్ పెట్టుకుంది. నిజానికి లైవ్ లో ఏం జరిగిందంటే., ప్రతి పాయింట్ ని సాగతీస్తూ రతిక మాట్లాడుతుంటుంటే ప్రియాంక కౌంటర్ ఎటాక్ చేసింది. రతిక ల్యాగ్ చేయకుండా నామినేషన్ స్టార్ట్ చేయమని బిగ్ బాస్స స్వయంగా చెప్పాడు. దీంతో ప్రియాంక అదే పాయింట్ పట్టుకుంది. నీ పాయింట్స్ నువ్వు చెప్పు అంతేకానీ ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావ్ అంటూ ప్రియాంక రతికతో ఎదురుదాడి చేసింది.

అయినా కూడా రతిక అటూ ఇటూ తిరుగుతూ ఇమిటేట్ చేస్తూ రెచ్చిపోయింది. రాజమాతగా ఉన్నప్పుడు నీ డెసీషన్ నువ్వు తీస్కోలేకపోయావ్, పాయింట్ ఉన్నా కూడా నామాట వినలేదంటూ మాట్లాడింది. అలాగే, శోభాశెట్టికి కూడా నామినేట్ చేసింది. కెప్టెన్సీ విషయంలో నువ్వు సరిగ్గా చేయలేదని చెప్పింది. మరి నాగ్ సర్ అడిగితే చేయి ఎందుకు లేపావ్ అంటే, అన్నీ నాగ్ సర్ ముందు డిస్కస్ చేయలేము. మనం పంచాయితీలు మనమే పెట్టుకోవాలంటూ రెచ్చిపోయింది. నిజానికి రతిక శోభా – ప్రియాంక కూల్ గా మాట్లాడతారని ఊహించలేదు. ఎలిమినేషన్ భయంతో పిచ్చి పిచ్చి గా ప్రవర్తించింది. అయితే, పల్లవి ప్రశాంత్ రతికని అక్కా అక్కా అంటూనే రెండో ఓటు వేశాడు.

దీంతో నామినేషన్స్ లోకి రావాల్సి వచ్చింది. శివాజీ గైడెన్స్ తోనే రతిక రెచ్చిపోయింది. నామినేషన్స్ లో టాలెంట్ చూపించు నిన్ను నువ్వు నమ్ము. నన్ను నమ్ము నీకు బాగా హెల్ప్ అవుద్ది. వాళ్లు నిన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోకుండా వాళ్లు మాట్లాడేది కూడా విను. భయపడద్దు అంటూ శివాజీ చెప్పిన మాటలు విని వచ్చిన రతికకి ప్రియాంక ఇంకా శోభా ఇద్దరూ గడ్డిపెట్టారు. అలాగే, ప్రియాంక అయితే నీకు పాయింట్స్ లేవ్ వేరేవాళ్లు చెప్పినది తీస్కుని వచ్చి ఇక్కడ చెప్తున్నావ్ అంటూ గాలితీసేసింది. అంతేకాదు, నీకు నాగార్జున సర్ , మీ అమ్మ వచ్చి చెప్పేవరకూ ఎలా ఆడుతున్నావో కూడా అర్దం కావట్లేదని హితబోధ చేసింది. మొత్తానికి ఏదో చేయబోయి రతిక ఎదురుదెబ్బ తగిలించుకుంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus