Rathika Eliminated: పరమ బోరింగ్ సండే..! రతిక ఎలిమినేషన్ కి అసలు కారణం అదేనా ?

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇందులో భాగంగా శనివారం అశ్విని ఎలిమినేట్ అయిపోయింది. అశ్విని జెర్నీ చూసిన తర్వాత అశ్విని వెళ్లిపోవడమే కరెక్ట్ అని భావిస్తున్నారు బిగ్ బాస్ ఆడియన్స్. ఎందుకంటే, ఈవారం అశ్విని సెల్ఫ్ నామినేషన్ అనేది చేసుకుంది. డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా నామినేట్ చేసుకుంది. అలాగే, ఏడుస్తూ ఏడుపుతోనే సింపతీ గేమ్ ఆడాలని చూసింది. సీరియల్ బ్యాచ్ ని టార్గెట్ చేసి వాళ్లని నామినేట్ చేస్తూ బయట ఓటింగ్ ని పెంచుకోవాలని చూసింది. కానీ అశ్విని ప్లాన్ బెడిసి కొట్టింది. ఇక ఆదివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఎప్పటిలాగానే పరమ బోరింగ్ టాస్క్ లని ఆడించాడు.

పిక్చర్స్ ని బ్లర్ చేస్తూ గెస్ చేసే గేమ్, అలాగే సినిమా పోస్టర్ గెస్సింగ్ ఆటని ఆడించాడు. ఈరెండు కూడా పార్టిసిపెంట్స్ ఉత్సాహంగా ఆడినా, ఆడియన్స్ మాత్రం నిరుత్సాహంగా చూశారు. ఇక ఎలిమినేషన్ రౌండ్ అనేది అర్జున్ ఇంకా రతిక ఇద్దరి మద్యలో జరిగింది. రతిక ఎలిమినేట్ అయ్యింది. అయితే, పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ ని ఆఖరి వారం వాడతాను అంటూ నాగార్జునకి చెప్పాడు. దీన్ని బట్టీ టాప్ 5లో ఎవరుండాలి అనేది తను డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక రతిక వెళ్లిపోతున్నా కూడా పెద్దగా ఎవ్వరూ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే, ఫస్ట్ లో తను ఉన్నప్పుడు కూడా పెద్దగా ఎవరితోనూ కనక్షన్ అనేది పెట్టుకోలేదు.

అలాగే, ఇప్పుడు తిరిగి హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఎవరితోనూ బాండింగ్ అనేది పెంచుకోలేదు. శివాజీ బ్యాచ్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉందని తెలిసి కొన్ని వారాలు సేఫ్ గా అటుసైడ్ ఉండి గేమ్ ఆడింది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసి ట్విస్ట్ ఇద్దామని అనుకుంది. కానీ, మైయిన్ పాయింట్స్ చెప్పడంలో విఫలం అయ్యింది. అందుకే ఎలిమినేట్ అయ్యింది. అసలు రతిక ఎలిమినేషన్ కి ఐదు కారణాలు చూసినట్లయితే.,

1. రీ ఎంట్రీ అనేది రతికకి పెద్ద మైనస్ అయ్యింది. హౌస్ మేట్స్ వద్దన్న అమ్మాయి ఉల్టా పుల్టాగా రావడంతో హౌస్ ఎవ్వరూ కూాడ ఆమెకి సపోర్ట్ చేయలేదు.

2. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ని ఎమోషనల్ గా దెబ్బకొట్టడానికి డ్రామా ఆడింది. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. పల్లవి ప్రశాంత్ కూడా అక్కా అక్కా అంటూనే మాట్లాడాడు. అక్కా కాదు రతిక అని పిలువు అన్నా కూడా పిలవలేదు. దీంతో రతికకి మైనస్ అయ్యింది.

3. శివాజీ బ్యాచ్ తో ఉంటూనే గేమ్ విషయంలో ఎదురు తిరిగింది. అలాగే, రాజమాతల అప్పుడు కూడా పార్టిసిపెంట్స్ విషయంలో స్టాండ్ తీస్కోలేకపోయింది. స్టార్ మా బ్యాచ్ తో గొడవ పెట్టుకుంటే ఆడియన్స్ లో క్రేజ్ వస్తుందని భ్రమలో గేమ్ ఆడింది.

4. రతికకి సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్ లేదు. అందుకే, ఫస్ట్ వీక్స్ లోనే పల్లవి ప్రశాంత్ తో తిరగడం వల్ల బ్రతికిపోయింది. ఎప్పుడైతే తన షేడ్స్ చూపించిందో అప్పుడు ఎలిమినేట్ అయ్యింది. రీ ఎంట్రీ తర్వాత కూడా తనకి ఉన్న ల్యాగ్ స్టార్ అవార్డ్ ని కంటిన్యూ చేస్తూ గేమ్ ఆడింది. తన లాజిక్స్ ఏ గేమ్ లో కూడా వర్కౌట్ అవ్వలేదు.

5. అందరికంటే కూడా భిన్నమైన గేమ్ ఆడాలనీ, గేమ్ ఛేంజర్ అవ్వాలని ఆశ పడింది. కానీ అది జరగలేదు. అంతేకాదు, సోషల్ మీడియాలో సెకండ్ టైమ్ రీ ఎంట్రీ ఇచ్చినా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోలేకపోయింది. అందుకే, ఎలిమినేట్ అయ్యింది.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus