Rathika Re-Entry: కొత్త కెప్టెన్ ఎవరంటే ? హౌస్ లో టాస్క్ లో గెలిచింది వీళ్లే..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం జిలేబీ పురం, గులాబీ పురం అనే టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్మిమ్మింగ్ పూల్ టాస్క్ లో జిలేబీ పురం గెలిచి లీడింగ్ పాయింట్ ని సంపాదించింది. ఆ తర్వాత గులాబీ పురం వాళ్లు ఛార్జింగ్ టాస్క్ లో గెలిచి ఒక్క పాయింట్ ని చేజిక్కించుకున్నారు. దీంతో జిలేబీ పురం వాళ్లు విన్నర్స్ గా నిలిచారు. పల్లవి ప్రశాంత్ ఇంకా గౌతమ్ ఇద్దరి మద్యలో జరిగిన టాస్క్ లో గౌతమ్ గెలిచాడు. దీంతో పల్లవి ప్రశాంత్ సోలోగా ఆడిన గేమ్ లో ఫస్ట్ టైమ్ ఓడిపోయాడు.

ఈ టాస్క్ తర్వాత హౌస్ లోకి తేజ కోసం ఒక కేక్ పంపించాడు బిగ్ బాస్. ఈ కేక్ తింటే ఏమవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇంట్లో హౌస్ మేట్స్ అందరూ కూడా ఈ కేక్ చుట్టూ ఈగల్లా మూగారు. ముఖ్యంగా అమర్ అయితే ఈ కేక్ తినేద్దామని కన్నేశాడు. జిలేబీ పురం టాస్క్ లో ఫైనల్ గా విజయం సాధించి వాళ్లు కెప్టెన్సీ కంటెండర్స్ గా మారారు. అంతేకాదు, ఇదే టైమ్ లో రతిక రీ ఎంట్రీ ఇచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది. (Rathika) రతిక రీ ఎంట్రీ అనేది హౌస్ లో అందర్నీ షాక్ కి గురి చేసింది.

ఎందుకంటే, హౌస్ మేట్స్ అందరూ కూడా రీ ఎంట్రీగా ఎవరు రావాలని ఓటింగ్ లో డిసైడ్ చేశారు. కానీ, బిగ్ బాస్ మాత్రం హౌస్ మేట్స్ ఓటింగ్ లో లీస్ట్ ఓటింగ్ వచ్చిన వారిని రీ ఎంట్రీ చేయిస్తానంటూ.., రతికని హౌస్ లోకి పంపించాడు. దీంతో రతిక స్టైల్ గా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో జిలేబీ పురం టీమ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇందులో ఫైనల్ గా సందీప్ ఇంకా అర్జున్ ఇద్దరూ ఛాలెంజ్ లో పాల్గొన్నారు.

కెప్టెన్సీ పోటీలో సందీప్ విజయం సాధించి ఇంటికి మూడో కెప్టెన్ గా నిలిచాడు. దీంతో వచ్చే వారం కూడా సందీప్ సేఫ్ అయ్యాడు. ఇంటి కెప్టెన్ అయ్యాడు కాబట్టి నామినేషన్స్ నుంచీ తప్పించుకుంటాడు. ఈవారం అతను నామినేషన్స్ లో లేడు. కేవలం ఒకే ఒక్క ఓటు పడింది. లాస్ట్ టైమ్ కూడా సందీప్ కి ఓట్లు పడినా కూడా గౌతమ్ ప్రత్యేకమైన పవర్ ద్వారా సందీప్ ని సేఫ్ చేశాడు. ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు కాబట్టి వచ్చే వారం కూడా నామినేషన్స్ లో లేడు. ఇక సందీప్ వరుసగా 8వారాలు నామినేషన్స్ లోకి రాకుండా ఉన్న ఏకైక కంటెస్టెంట్ అయ్యాడు. అదీ మేటర్.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus