Bigg Boss 7 Telugu: ప్రిన్స్ ప్యాంట్ లో ఐస్ పోసిన రతిక..! ఆడియన్స్ కామెంట్స్..!

బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం అలజడి సృష్టించాడు బిగ్ బాస్. మూడువారాల ఇమ్యూనిటీ కోసం పోటీ పడే కంటెండర్స్ ని తానే స్వయంగా ఎంపిక చేసుకున్నాడు. ఇందులో ఎవరికి అర్హత లేదో చెప్పమని ఓట్లు వేయమని కంటెస్టెంట్స్ కి టెస్ట్ పెట్టాడు. ఇందులో ప్రిన్స్ ని వ్యతిరేకిస్తూ రతిక, థామిని, తేజలు ఓట్లు వేశారు. దీనివల్ల ప్రిన్స్ కి మెంటల్లీ – ఫిజికల్లీ తన ఎబిలిటీని నిరూపించుకునే ఛాలెంజ్ వచ్చింది. గార్డెన్ ఏరియాలో ఉన్న స్టాండ్ పైన గెడ్డాన్ని ఆనించి గంట సేపు ఉండాలి.

ఈలోగా తనని ఛాలెంజ్ చేసిన ఇంటిసభ్యులు ప్రిన్స్ ని డిస్టర్బ్ చేయాలి. ఎలాగైనా టాస్క్ ఓడిపోయేలా చేయాలి. ఇందుకోసం రతిక, థామిని ఇంకా తేజలు ప్రిన్స్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఫస్ట్ లో పుల్లని తీస్కుని వచ్చి రతికి ప్రిన్స్ ముక్కులో పెట్టే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఐస్ ఐస్ అంటూ తేజ ఐస్ ని తీస్కుని వస్తే, ఆ ఐస్ ని ప్రిన్స్ ప్యాంట్ లో వెనక నుంచీ పోసింది రతిక. అంతేకాదు, థామని సబ్బు నురగని కలిపి ప్రిన్స్ ముఖంపై కొట్టింది.

అలాగే, వాటర్ ని మగ్ తో కొడుతూ ప్రిన్స్ ని నానావిధాలుగా డిస్టర్బ్ చేశారు. కానీ, పట్టువదలని విక్రమార్కుడిలా ప్రిన్స్ అలాగే ఉన్నాడు. సంచాలక్ గా వ్యవహరించిన శివాజీ రెండు మూడుసార్లు కన్ఫూజ్ అయినా కూడా సందీప్ మాటలని విన్నాడు. మద్యలో డౌట్ వస్తే ప్రిన్స్ కి మరో ఛాన్స్ ఇచ్చారు. అయితే, ఇక్కడే రతిక ఇంకా థామిని ఇద్దరూ కూడా బిగ్ బాస్ పంపించిన గడ్డి, పేడ నీళ్లు కూడా ప్రిన్స్ పైన పోశారు. అయినా కూడా ప్రిన్స్ తన ఏకాగ్రతని ఎక్కడా పొగొట్టుకోలేదు.

దీంతో గంట సేపు అలాగే ఉన్న ప్రిన్స్ మూడు వారాల ఇమ్యూనిటీ కోసం పోటీ పడే మొదటి కంటెండర్ అయ్యాడు. అయితే, ఈ ఎపిసోడ్ చూసిన బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ రతిక చేసిన పనికి సీరియస్ అయ్యారు. ఎందుకంటే, ఐస్ వేరే ఎక్కడైనా కూడా పోసి డిస్టర్బ్ చేయచ్చు. కానీ కావాలనే ప్రిన్స్ ప్యాంట్ లో పోసింది రతిక. ఇక ఆ తర్వాత దానిపైన జోకులు కూడా వేసుకున్నారు. తేజ స్టోర్ రూమ్ లో వచ్చిన లెటర్ ని చదువుతూ కామెడీ చేస్తుంటే రతిక కూడా కౌంటర్ వేసింది.

దీనికి ఆడియన్స్ ఆ అమ్మాయికి గేమ్ తెలుసా ? పిచ్చి ఆట ఆడుతోందని కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయి అయి ఉండి సిగ్గులేకుండా ప్యాంట్ లో ఐస్ పోస్తుందా అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు, అంతకుముందే ప్రిన్స్ ని నామినేట్ చేసి తర్వాత అతనితో కలిసి భోజనం చేసి మళ్లీ ఇప్పుడు టాస్క్ వచ్చేసరికి ఇలా చేయడం కరెక్ట్ కాదని, రతిక డబుల్ గేమ్ ఆడుతూ తన రంగులు చూపిస్తోందని చెప్తున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus