కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) , అక్కడి స్టార్ డైరెక్టర్ హరి (Hari) కాంబినేషన్లో ‘భరణి’ ‘పూజా’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మూడో చిత్రంగా ‘రత్నం'(తమిళ్ లో ‘రత్తం’) (Rathnam) రూపొందింది. ‘భరణి’ ‘పూజా’ చిత్రాలు తెలుగులో కూడా బాగా ఆడాయి. అందుకే ‘రత్నం’ పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ‘జీ స్టూడియోస్’తో పాటు ‘స్టోన్ బెంచ్ ఫిల్మ్స్’ బ్యానర్ల పై కార్తికేయన్ సంతానం ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్ నటించింది.
ఏప్రిల్ 26న రిలీజ్ కాబోతున్న ‘రత్నం’ చిత్రానికి తెలుగులో కూడా మంచి బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 1.80 cr |
సీడెడ్ | 0.60 cr |
ఆంధ్ర | 1.00 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 3.40 cr |
‘రత్నం’ చిత్రానికి రూ.3.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి రూ.3.7 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. గత 2 ,3 వారాలుగా మినిమమ్ హైప్ ఉన్న కొత్త సినిమా రిలీజ్ కాలేదు. ఈ వారం రిలీజ్ కావాల్సిన ‘ప్రతినిథి 2 ‘ (Prathinidhi 2) కూడా పోస్ట్ పోన్ అయ్యింది. బి, సి సెంటర్స్ లో విశాల్ సినిమాలకి ఫ్లోటింగ్ బాగుంటుంది. ఈ ఛాన్స్ ని కనుక వాడుకుంటే ‘రత్నం’ కమర్షియల్ గా గట్టెక్కేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.