షూటింగ్ పూర్తి చేసుకున్న ‘రేవ్ పార్టీ’.. ఆగస్ట్ లో విడులకు సన్నాహాలు

యువతకు నచ్చేలా వినుత్నమైన సినిమాలను అలరించే ప్రేక్షకుల కోసం ఎంతో వైవిధ్యబరితమైన కొత్త కథతో తెరకెక్కుతున్న తాజా చిత్రం రేవ్ పార్టీ.బొనగాని ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రాజు బొనగాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రేవ్ పార్టీ” నేటితో దిగ్విజయంగా షూటింగ్ ముగించుకుంది. క్రిష్ సిద్దిపల్లి, రితిక చక్రవర్తి, ఐశ్వర్య గౌడ, సుచంద్ర ప్రసాద్, తారక్ పొన్నప్ప, తదితరుల ముఖ్య తారగణంతో మైసూర్, ఉడిపి, బెంగళూరు, మంగళూరు తదితర ప్రాంతాల్లో 35 రోజులు ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంది.

రేవ్ పార్టీ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషలలో విడుల చేస్తున్నారు. క్రిష్ సిద్దిపల్లి హీరోగా, రితిక చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఐశ్వర్య గౌడ రేవ్ పార్టీ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా డైరెక్టర్ రాజు బొనగాని మాట్లాడుతూ.. ఒకే ఒక షెడ్యూల్లో దాదాపు 35 రోజుల్లో రేవ్ పార్టీ సినిమాను పూర్తి చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఒకే షెడ్యూల్లో సినిమా పూర్తి అవడానికి సహకరించిన నటీనలకు, సాంకేతిక నిపుణులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు . షూటింగ్ ముగించుకున్న రేవ్ పార్టీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు డైరెక్టర్ రాజు బోనగాని తెలిపారు.

సాధారణంగా ఉడిపి, గోవా, బెంగుళూరు లాంటి ప్రాంతాలలో ఎక్కువగా రేవ్ పార్టీలు జరుగుతుంటాయని, అందుకే ఆ ప్రాంతాల్లోనే ఒరిజినల్ లొకేషన్స్ లో మూవీని చిత్రీకరించినట్లు తెలిపారు. అలాగే రేవ్ పార్టీలు ఎలా జరుగుతాయి. ఆ రేవ్ పార్టీ ల వెనుక ఎవరెవరు ఉంటారు. వాటి వల్ల యువతకు జరిగే నష్టం ఎంటన్నది ఈ చిత్రంలో స్పష్టంగా చూపించినట్లు, ఈ మూవీ కంటెంట్ కచ్చితంగా యువతకు, సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేసి, ఆగస్ట్ లో చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు డైరెక్టర్ రాజు బొనగాని తెలిపారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus