Raveena Tandon: థండర్ థైస్ అని నిక్ నేమ్ పెట్టారు

చాలా మంది ఆడవాళ్లు బాడీ షేమింగ్ ఎదుర్కొంటుంటారు. ఇక సెలబ్రిటీలకైతే ఇలాంటి అవమానాలు తరచూ జరుగుతుంటాయి. ఇప్పుడైతే హీరోయిన్లంతా జీరో సైజ్ మెయింటైన్ చేస్తున్నారు కానీ అప్పట్లో చాలా మంది నటీమణులు బొద్దుగానే ఉండేవారు. ప్రేక్షకులు కూడా అలాంటి వారినే ఇష్టపడేవారు. కానీ ఇలా బొద్దుగా ఉండడం వలన చాలా మంది బాడీ షేమింగ్ ఎదుర్కొన్నారు. నటి రవీనా టాండన్ కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. తన తొడల గురించే అందరూ మాట్లాడుకునేవారని, థండర్ థైస్ అనే నిక్ నేమ్ తో పిలిచేవారని చెప్పుకొచ్చింది రవీనా.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పదహారున్నరేళ్లకే తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని.. ఆ సమయంలో టీనేజ్ లో ఉన్న తను కాస్త ఎక్కువ బరువుతో ఉండేదాన్ని అని చెప్పారు రవీనా. అలా బరువు ఎక్కువగా ఉండడంతో వలన తన కాళ్లు, తొడలు లావుగా ఉండేవని తెలిపింది. అయితే సినిమాల్లో అవకాశాలకు అది తనకు అడ్వాంటేజ్ గా మారిందని చెప్పుకొచ్చింది. నిజ జీవితంలో మాత్రం తనకు బాడీ షేమింగ్ ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు.

చాలా మంది తనను థై క్వీన్ అని పిలిచేవారని తెలిపింది. బరువు తగ్గడానికి తాను ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని గుర్తుచేసుకుంది. అప్పట్లో ఈ బ్యూటీకి చాలా క్రేజ్ ఉండేది. సినిమాలో రవీనాను చాలా గ్లామరస్ గా చూపించేవారు. ఇప్పుడు ఆమె వయసు యాభైకి దగ్గరవుతుంది. ఇప్పటికీ ఆమె సినిమాల్లో నటిస్తూనే ఉంది. కానీ ఎప్పుడూ కూడా బాడీ షేమింగ్ కూడా ఎక్కడా మాట్లాడలేదు.

ఇప్పుడు ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టింది. అయితే అలాంటి కామెంట్స్ ను తాను సరదాగానే తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. చివరిగా ఈమె ‘కేజీఎఫ్2’లో కనిపించింది. ఇందులో తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం ఈమె చేతిలో ఓ ప్రాజెక్ట్ ఉంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus