Ravi Teja: బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. రవితేజ మససులో ఏముందంటే?

  • October 16, 2023 / 12:20 PM IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో అయితే రెండు పార్టులు, లేదంటే సీక్వెల్స్‌ అంటున్నారు. వాటిలో ఎన్ని ముందుకొస్తాయి, ఎన్ని వస్తాయి అనేది పక్కన పెడితే చర్చ మాత్రం వాటి గురించే నడుస్తోంది. ఈ రెండూ కాకుండా మరో పాయింట్‌ అంటే ‘బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌ రిపీట్‌’. ఇప్పుడు మేం చెబుతున్న విషయం కూడా అచ్చంగా అలాంటిదే. 17 ఏళ్ళ క్రితం వచ్చిన ఓ సినిమా సీక్వెల్‌ గురించి ఆ హీరో దగ్గర మాట్లాడితే ఆసక్తికర సమాధానం వచ్చింది.

రవితేజ ఇప్పుడు ఇంచుమించు ఇండియన్‌ రాబిన్‌ హుడ్‌ పాత్రను పోషించారు. అదే ‘టైగర్‌ నాగేశ్వరరావు’. 1970వ సమయంలో స్టూవర్ట్‌పురం ప్రాంతంలో పెద్దల్ని కొట్టి పేదలకు పెట్టిన నాగేశ్వరరావు అనే గజ దొంగ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ తన పాత సినిమాల గురించి కూడా మాట్లాడాడు రవితేజ. అప్పుడే ‘విక్రమార్కుడు’ సినిమా ప్రస్తావన వచ్చింది.

రవితేజ (Ravi Teja) కెరీర్‌లో ‘విక్కమార్కుడు’ సినిమాను మించి మాస్‌ మసాలా సినిమా ఇంకొకటి ఉండదు అని చెప్పొచ్చు. విక్రమ్‌ రాథోడ్‌, అత్తిలి సత్తిబాబుగా రెండు పాత్రల్లో అలరించాడు మాస్‌ మహరాజా. దీంతో ఈ సినిమా సీక్వెల్‌ ఏమన్నా చేస్తారా అని రవితేజను ఓ మీడియా పర్సన్‌ అడిగారు. దానికి స్పందించిన రవితేజ ‘విక్రమార్కుడు’ సీక్వెల్‌ గురించి రాజమౌళితో ఇప్పటి వరకు మాట్లాడలేదని చెప్పాడు. అయినా రాజమౌళితో కలిసి వర్క్‌ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉండరు చెప్పండి.

ఆయనతో కలిసి పనిచేయాలని భారతీయ సినీ పరిశ్రమలో చాలామంది సిద్ధంగా ఉంటారు అని అన్నారు రవితేజ. మరి రాజమౌళి మనసులో ఏముందో చూడాలి. ఆయన ఉన్న బిజీ లైనప్‌లో ఈ సినిమా ఇప్పుడు కష్టమే. అంతేకాదు ‘ధమాకా’ తరహాలో మరో కామెడీ సినిమాతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్నాను అని చెప్పాడు. అలాగే ఓ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా కూడా చేసే ఆలోచన ఉందని చెప్పాడు. తన బయోపిక్ తీస్తే ‘మాస్‌ మహారాజా’ అనే టైటిల్‌ను పెడతానని చెప్పాడు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus