లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో చాలా సినిమాల షూటింగ్లు ఆగిపోయాయి. అందులో రవితేజ ‘క్రాక్’ సినిమా కూడా ఒకటి..! ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని రవితేజ భావిస్తున్నాడు. తన గత చిత్రాలు అయిన ‘టచ్ చేసి చూడు’ ‘నేల టికెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. అంతేకాదు ఆ చిత్రాలు కనీసం 10 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయాయి. దాంతో రవితేజ మార్కెట్ కూడా దెబ్బతింది. కాబట్టి ఈ లాక్ డౌన్ టైములో తన కెరీర్ ను చక్క దిద్దుకోవాలని కొత్త లెక్కలు వేసుకుంటున్నాడట రవితేజ.
వైరస్ మహమ్మారి విజృంభణ తగ్గిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టి ‘క్రాక్’ ను సింగిల్ షెడ్యూల్ లో ఫినిష్ చేస్తున్నాడట. అంతేకాదు ఏకంగా 5 సినిమాలను అనౌన్స్ చేయబోతున్నాడని వినికిడి. మొన్నటి వరకూ ఒక్కో సినిమాకు 10 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తూ వచ్చాడు రవితేజ. కానీ వరుస పరాజయాల కారణంగా తన రూటు మార్చుకున్నట్టు తెలుస్తుంది. తన సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో వచ్చే డబ్బుని తన పారితోషికంగా ఇచ్చెయ్యమని నిర్మాతలను కోరాడట రవితేజ. ఇతని సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ కు మంచి డిమాండ్ ఉంది.
వాటి లెక్క కూడా 8 కోట్ల నుండీ 10 కోట్ల వరకూ ఉంటుంది. అయితే నిర్మాతలు రవితేజకు సినిమాలు మొదలుపెట్టడానికి ముందే అడ్వాన్స్ లు అవి ఇచ్చి వాటికి ఇంట్రెస్ట్ లు కట్టుకోవాల్సిన పని ఉండదు. ఇక సినిమాని 10కోట్ల నుండీ 15కోట్ల బడ్జెట్ లో కనుక ఫినిష్ చేస్తే.. థియేట్రికల్ రైట్స్ రూపంలోనే 18 కోట్లు..ఇక డిజిటిల్ రైట్స్ రూపంలో మరో 7లేదా 8 కోట్లు వస్తాయి. దాంతో రవితేజ సినిమా అంటే.. 10కోట్ల టేబుల్ ప్రాఫిట్ నిర్మాతలకు మిగిలే అవకాశం ఉంటుంది. అందుకే రవితేజ ఈ కొత్త లెక్క వేసుకున్నట్టు సమాచారం.
Most Recommended Video
ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!