Ravi Teja: ‘దండ కడియాల్‌..’ పాట వెనుక ఇంత కష్టం ఉందా?

‘ధమాకా’ సినిమాలోని ‘దండ కడియాల్‌..’ పాట చూశారా? ఇటీవల యూట్యూబ్‌లో వచ్చిన ఈ పాట వ్యూస్‌ పరుగులో ఉసేన్‌ బోల్ట్‌లా దూసుకుపోతోంది. అయితే ఆ పాట వెనుక చాలా పెద్ద కథే ఉంది అని ఇంతకుముందే చెప్పాం. అయితే అప్పుడు అది కేవలం సమాచారం మాత్రమే. ఇప్పుడు దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చింది ఆ సినిమా కథానాయిక శ్రీలీల. పాటకు ముందు రవితేజకు ఏమైంది, ఆ తర్వాత ఆయనేం చేశాడు అనే విషయాలు చెప్పారామె.

రవితేజను మొండోడు రవితేజ అంటే బాగుంటుందేమో అనిపిస్తుంటుంది. కారణం ఆయన మొండిగా తీసుకునే నిర్ణయాలే. సినిమా అంటే ఎంతవరకైనా ముందుకెళ్లే తత్వం ఆయనది. తాజాగా ‘ధమాకా’ విషయంలోనూ ఇలాంటి పనే చేశాడు. కాలి గాయంతోనే ఆయన ఓ పాటలో స్టెప్పులేశారట. ‘ధమాకా’ సినిమా నుండి ఇటీవల ‘దండ కడియాల్‌.. దస్తి రుమాల్‌..’ అంటూ ఓ పాటను రిలీజ్‌ చేశారు. ఈ పాట కోసం ఆయన అంత సాహసం చేశాడు. ‘దండ కడియాల్‌..’ పాట లిరికల్‌ సాంగ్‌కు ఇప్పుడు భలే రెస్పాన్స్‌ వస్తోంది.

రవితేజ, శ్రీలీల పోటీ పడి మరి స్టెప్పులేశారు. అయితే రవితేజ డ్యాన్స్‌ విషయంలో ఓ విషయం గమనించాలి. ఆ పాటలో రవితేజ డ్యాన్స్‌ వేయడానికి అనువుగా ఆయన కాళ్లు లేవట. సినిమా షూటింగ్‌లో భాగంగా ఆయన కాలిలోకి ఇనుప చువ్వ దిగిందట. దీంతో అతనికి 12 కుట్లు వేశారట. ఈ విషయం సినిమా నాయిక శ్రీలీల చెప్పింది. సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ విషయాలు చెప్పుకొచ్చింది. ‘దండ కడియాల్‌..’ పాట కోసం అంతా రెడీ అయ్యి, సెట్‌ రెడీ చేసుకున్నాక..

గ్యాప్‌ ఇస్తే బాగోదు అనుకుని పాటకు రెడీ అయిపోయారట రవితేజ. కాలికి కుట్లుతోనే డ్యాన్స్‌ వేశాడు. ఆ పాట విన్నప్పుడు రవితేజకు వచ్చిన ఊపు అంత డేర్‌ చేయడానికి కారణం అని చెబుతున్నారు. దానికి తోడు సినిమా రిలీజ్‌కి డేట్‌ దగ్గర పడటంతో డేర్‌ చేశారని చెబుతున్నారు. ఆ పాటలో రవితేజ హుషారు చూసినవాళ్లు.. కాలికి గాయం, కట్టుతో రవితేజ ఆ డ్యాన్స్‌ చేశాడు అంటే నమ్మడం చాలా కష్టం. అంత బాగా మేనేజ్‌ చేశాడు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus