Ravi Teja: ఆ ఏరియాలో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న మాస్ మహారాజ్.. ఎన్ని స్క్రీన్లంటే?

మాస్ మహారాజ్ రవితేజ ఈగల్ సినిమాతో అబవ్ యావరేజ్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా రవితేజ అభిమానులకు ఎంతగానో నచ్చింది. మరోవైపు రవితేజ నిర్మాతగా చిన్న సినిమాలను నిర్మిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే మాస్ మహారాజ్ రవితేజ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్, మహేష్ బాబు దారిలో రవితేజ నడుస్తున్నారు. దిల్ సుఖ్ నగర్ లో ఆసియన్ సినిమాస్ తో కలిసి రవితేజ ఆరు స్క్రీన్లతో కూడిన మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారని సమాచారం అందుతోంది.

మరికొన్ని నెలల్లో ఈ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తవుతుందని తెలుస్తోంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా భారీ స్థాయిలో ఈ మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. రవితేజ ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఏఎంబీ సినిమాస్, ఏఏఏ మల్టీప్లెక్స్ ఇప్పటికే హైదరాబాద్ లో పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నాయి.

రవితేజ బ్రాండ్ తో దిల్ సుఖ్ నగర్ లో ఏర్పాటు కానున్న ఈ మల్టీప్లెక్స్ సైతం సులువుగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆసియన్ సినిమాస్ రాబోయే రోజుల్లో మరి కొందరు స్టార్ హీరోల భాగస్వామ్యంతో మరిన్ని మల్టీప్లెక్స్ లను నిర్మించే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది.

రవితేజ (Ravi Teja) కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమాతో బిజీగా ఉన్నారు. షాక్, మిరపకాయ్ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మాస్ మహారాజ్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నారు. మిస్టర్ బచ్చన్ తో రవితేజ ఏ రేంజ్ హిట్ అందుకుంటారో చూడాల్సి ఉంది.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus