Ravi Teja: విక్రమార్కుడు సీక్వెల్ రాబోతోందా… రవితేజ సమాధానం ఇదే!

  • October 16, 2023 / 11:21 PM IST

మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక రవితేజ కెరియర్ లో ఈ సినిమా మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో రవితేజ పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీపైనే ఫోకస్ చేశారు.

ఈ క్రమంలోనే అక్కడ పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాని ప్రమోట్ చేసే పనులలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వరుస బాలీవుడ్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాను ప్రమోట్ చేస్తూ ఉన్నారు.అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రవితేజ తన తదుపరి సినిమాల గురించి కూడా మాట్లాడారు. ఇక తన సినీ కెరియర్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన విక్రమార్కుడు సినిమా సీక్వెల్ చిత్రం గురించి కూడా ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో (Ravi Teja) రవితేజ అనుష్క హీరో హీరోయిన్లుగా నటించినటువంటి విక్రమార్కుడు సినిమా ఎలాంటి సక్సెస్ అందుకు ఉందో మనకు తెలిసిందే. అయితే ఫ్యూచర్లో ఈ సినిమా సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారా అంటూ ఆయనకు ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతూ ఇప్పటివరకు రాజమౌళి గారు ఈ సినిమా సీక్వెల్ గురించి ఇప్పటివరకు నాతో ఎప్పుడూ కూడా ప్రస్తావించలేదు.

తాను రాజమౌళి గారితో సినిమా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అంటూ ఈ సందర్భంగా రవితేజ తెలియజేశారు. ఇలా ఈయన మాటలను బట్టి చూస్తే విక్రమార్కుడు సీక్వెల్ వచ్చే ప్రసక్తే లేదని అర్థమవుతుంది. ఇక తన తదుపరి సినిమా పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, ఈ సినిమా తర్వాత మరో సైన్స్ ఫిక్షన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను అంటూ తదుపరి సినిమాల గురించి కూడా రవితేజ తెలిపారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus