గోపీచంద్ మలినేని (Gopichand Malineni).. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తీసిన మాస్ ఆడియన్స్ మెచ్చే విధంగా తీసి హిట్లు కొట్టడంతో ఇతను సిద్ధహస్తుడు. ఇతని కెరీర్లో ‘డాన్ శీను’ (Don Seenu) ‘బలుపు’ (Balupu) ‘క్రాక్’ (Krack) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) వంటి హిట్లు ఉన్నాయి. వాస్తవానికి బాలయ్య (Nandamuri Balakrishna) ‘వీరసింహారెడ్డి’ హిట్ అయ్యాక.. రవితేజతో (Ravi Teja) ఓ సినిమా మొదలుపెట్టాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి ముందుకొచ్చింది. కానీ బడ్జెట్ లెక్కలు ఎక్కువవడంతో మైత్రి సంస్థ ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టింది.
అయితే గోపీచంద్ తోనే ‘జాట్’ అనే బాలీవుడ్ సినిమాని నిర్మిస్తుంది. ఫేడౌట్ అయిపోయాడు అనుకున్న సన్నీ డియోల్ (Sunny Deol) ‘గదర్ 2’ (Gadar 2) తో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చింది. అది మలినేనికి బాగా కలిసొచ్చినట్టు అయ్యింది. బాలీవుడ్ ఆడియన్స్ కూడా మాస్ సినిమాలకే పెద్దపీట వేస్తున్నారు. అది కూడా గోపీచంద్ మలినేనికి కలిసొచ్చే అంశమే. ‘జాట్’ సినిమాలో కూడా ‘కొత్త కంటెంట్ ఏమీ ఉండదు’ అని ఇన్సైడ్ టాక్. కథ మొత్తం క్రాక్ టైపులోనే ఉంటుందని కొంతమంది అంటున్నారు. కానీ టీజర్ చూస్తే ‘హీరో పోలీసులనే టార్గెట్ చేస్తున్నాడేమో’ అనే ఫీలింగ్ కలిగించారు.
‘జాట్’ టీజర్లో చాలా సీక్వెన్స్ లు ‘క్రాక్’ ని తలపిస్తున్నాయి. దీంతో ‘గోపీచంద్ మలినేని అటు తిప్పి ఇటు తిప్పి ‘క్రాక్ 2′ తీసేస్తున్నాడా?’ అని రవితేజ అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే హీరో ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అని స్పష్టమవుతుంది. సన్నీ డియోల్ చాలా కాలం తర్వాత ఎనర్జిటిక్ గా కనిపించాడు. ఈ సినిమా కనుక హిట్ అయితే బాలీవుడ్ నుండి గోపీచంద్ మలినేనికి మరిన్ని ఆఫర్లు రావడం ఖాయంగా కనిపిస్తుంది.