Mass Jathara: దర్శకుడు భాను, నిర్మాత నాగవంశీలపై.. రవితేజ అభిమానులకు నమ్మకం పెరిగినట్టేనా?

రవితేజ (Ravi Teja) నటనలో కంప్లీట్ ఎనర్జీ ఉంటుంది. 57 ఏళ్ల వయసు వచ్చినా.. అతను థర్టీ ప్లస్..లానే నటిస్తాడు. రాజమౌళి డైరెక్షన్ నే డామినేట్ చేసిన ఎనర్జీ రవితేజ సొంతం. ‘ధమాకా’ (Dhamaka)  సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కడానికి కూడా ఆ ఎనర్జీనే కారణం. కానీ ఆ తర్వాత రవితేజ నుండి ‘రావణాసుర'(Ravanasura)  ‘టైగర్ నాగేశ్వరరావు’  (Tiger Nageswara Rao) ‘ఈగల్’ (Eagle)  ‘మిస్టర్ బచ్చన్’  (Mr. Bachchan) వంటి సినిమాలు వచ్చాయి. ఇందులో రవితేజ మార్క్ ఎనర్జీ కంప్లీట్ గా మిస్ అయ్యింది అనే కంప్లైంట్ ఉంది.

Mass Jathara

‘మిస్టర్ బచ్చన్’ కంటెంట్ రవితేజ ఎనర్జీకి ఎక్కడా స్కోప్ ఇవ్వలేదు. దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) అప్పటికీ బలవంతంగా కొన్ని ఎపిసోడ్స్ పెట్టి రవితేజ ఫ్యాన్స్ ని అలరించాలి అని చూసినా అది వర్కౌట్ కాలేదు. హరీష్ వల్లే సాధ్యం కానప్పుడు కొత్త దర్శకుడు భాను(Bhanu Bhogavarapu)   వల్ల ఏమవుతుంది అనే డౌట్ ఆడియన్స్ లో ఉంది. కానీ నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ విషయాన్ని బాగానే పసిగట్టేశాడు. రవితేజ అభిమానులకి ఏం కావాలో, తన సినిమాతో ఏం డెలివరీ చేయాలో..

ఒక అవగాహన తెచ్చుకున్నట్టు ఉన్నాడు. అందులో భాగంగా ఈరోజు ‘తు మేర లవర్’ లిరికల్ సాంగ్ ను వదిలాడు. ఈ ఒక్క సాంగ్ తో 4 సినిమాలుగా రవితేజ అభిమానులు మిస్ అయిన ఎనర్జీని తిరిగి వారిలో నింపే ప్రయత్నం చేశారు. 4 నిమిషాల 17 సెకన్ల నిడివి కలిగిన ఈ సాంగ్ రవితేజ అభిమానులను ఫుల్ ఖుషీ చేయిస్తుంది.

ఏఐ సాయంతో చక్రి (Chakri)  వాయిస్ ని తీసుకురావడం కూడా సాంగ్ కి హైలెట్ అయ్యింది అని చెప్పాలి.సోషల్ మీడియాలో ఈ సాంగ్ మార్మోగిపోతోంది. థియేటర్లలో ఈ ఒక్క పాటకు రవితేజ ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే ముందు ముందు రవితేజ అభిమానులకి ‘మాస్ జాతర’ (Mass Jathara) ప్రమోషన్స్ తో టీం మరింత కిక్ ఇస్తుందేమో చూడాలి.

రెండు ట్రెండింగ్‌ ప్రశ్నలకు ఆన్సర్‌ ఇచ్చిన తమన్నా.. ఏం చెప్పిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus