Ravi Teja: ప్లాప్ డైరెక్టర్ తో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన రవితేజ.. ఎలా అంటే..?

  • January 31, 2023 / 06:25 PM IST

‘కష్టే ఫలి’ అని పెద్దవాళ్ళు అన్నారు.అదేంటో.. ఎంత కష్టపడినా కొంతమందికి మాత్రం ఫలితం దక్కదు. అలాంటి వారి గురించి చెప్పుకోవాలి అంటే మనం బి.వి.ఎస్.రవి గురించి చెప్పుకోవాలి. ఇతను దర్శకుడిగా 2 సినిమాలు తీశాడు. రెండూ ప్లాపులే..! రైటర్ గా చేసిన సినిమాలు కూడా తనకు గుర్తింపు తీసుకురాలేదు. కానీ చాలా హిట్టు సినిమాలకు ఇతను రైటర్ గా పనిచేశాడు.కానీ వాటికి ఇతని పేరు వేయలేదు. మంచి సినిమాకి స్క్రీన్ పై పేరు పడకుండా..

స్క్రీన్ పై ఇతని పేరు పడిన సినిమాలు ప్లాప్ అయితే ఇతనికి లాభం ఏముంటుంది చెప్పండి. రవికి ఇలాగే జరిగింది. కానీ ఈ మధ్యన ఇతనికి కలిసొస్తున్నట్టు కనిపిస్తుంది. ఇతను రైటర్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఇతను నటుడిగా చేసిన ‘క్రాక్’ ‘ధమాకా’ ‘వీరసింహారెడ్డి’ ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో ‘క్రాక్’ మినహాయిస్తే మిగిలిన 3 సినిమాలు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ ను వసూల్ చేసిన సినిమాలే కావడం విశేషం.

ఇంకో కామన్ పాయింట్ ఏంటి అంటే.. ఈ 4 సినిమాల్లో 3 సినిమాలు రవితేజ నటించినవి కావడం. అలాగే ఇంకో సినిమా ‘వీరసింహారెడ్డి’ రవితేజ పరిచయం చేసిన గోపీచంద్ మలినేని దర్శకుడు కావడం. అలాగే రవిని నటుడిని చేసింది కూడా దర్శకుడు గోపీచంద్ మలినేని కావడం.

ఏదేమైనా ప్లాప్ డైరెక్టర్ తో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ఘనత మాత్రం ఈ రకంగా రవితేజకు సొంతమయ్యింది. బీవీఎస్ రవి ఈ టైంలో డైరెక్షన్ పై కొంచెం ఫోకస్ పెట్టి.. ఎవరొక హీరోని పట్టి సినిమా తీసి హిట్టు కొడితే.. అతని దశ తిరిగినట్టే అని అర్థం చేసుకోవచ్చు..!

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus