హీరోలు వరుసగా సినిమాలు చేస్తుంటే ఇండస్ట్రీకి మంచిది, ఆ హీరోను నమ్ముకున్నవాళ్లకు కూడా మంచిదే. అయితే వరుస సినిమాలు చేసే క్రమంలో ఏది పడితే అది, లేకపోతే మొహమాటానికి పోయి సినిమాలు చేస్తే చాలా ఇబ్బంది పడతారు. గతంలో చాలామంది హీరోలు హిట్ జోరులో వరుస సినిమాలు చేసేసి చేతులు కాల్చుకున్నారు. తర్వాత మెల్లగా కోలుకున్నారు. అందులో రవితేజ కూడా ఒకరు. ఇప్పుడు రవితేజ మేటర్ ఎందుకు అంటే… ‘క్రాక్’ హిట్‌తో రవితేజ వరుసగా సినిమాలు ఓకే చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నాడా?
రవితేజ హీరో కాకముందు చాలా రోజులు స్ట్రగుల్ చేశాడు. డైరక్షన్ డిపార్ట్‌మెంట్‌లో కూడా పని చేశాడు. దీంతో స్నేహితులు చాలా ఎక్కువ ఉంటారు. దాంతో స్ట్రగుల్ వాల్యూ తెలిసినోడు కాబట్టి వరుసగా అవకాశాలు ఇచ్చేస్తుంటాడు. అలా ఆ మధ్య కొత్త కుర్రాళ్లకు ఛాన్స్‌లు ఇచ్చి హిట్ కొట్టక ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడు మరీ కొత్త కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదు కానీ… ఓ మోస్తర్ హిట్ కొట్టి, తర్వాత ఫ్లాప్ ఇచ్చి ఖాళీగా ఉన్నవారికి అవకాశాలు ఇస్తున్నారు. అలా ఇప్పుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ చేస్తున్నాడు.
‘ఖిలాడీ’ చిత్రీకరణ చివరిదశకొచ్చింది. దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా, ఆ తర్వాత శరత్ మండవ డైరెక్షన్‌లో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని ప్లానింగ్ ఇక్కడితో ఆగలేదు. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా ఉండే అవకాశం ఉందట. వీరి కాంబినేషన్‌ఓ ‘భద్ర’ గుర్తుందా?. దాని తర్వాత కూడా రవితేజ మరో హిట్ ఇచ్చిన దర్శకుణ్ని లైన్‌లో ఉంచాడు. అతను ‘రాజా ది గ్రేట్’ అనిల్ రావిపూడి. ఈ లైనప్‌తో రవితేజ కనీసం రెండు, మూడేళ్లు బిజీ అన్నమాట. రాజు గారూ… జాగ్రత్త సుమా!
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!