Ravi Teja: సీనియర్ హీరోల పేర్లతో రవితేజ సినిమాలు.. ఊహించలేదు కదూ..!

మాస్ మహారాజ్ రవితేజ.. సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక అంచనాలు ఉంటాయి. అలా అని రవితేజ సినిమాకి ఓ మాదిరి టాక్ వస్తే ఆడినవి చాలా తక్కువ. అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లేదంటే ప్లాప్, డిజాస్టర్. అతని ట్రాక్ రికార్డు ఇలానే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేస్తున్న ఏకైక స్టార్ హీరో రవితేజనే అనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్ కి అయినా కొత్త డైరెక్టర్ కి అయినా ఛాన్స్ ఇవ్వడానికి రవితేజ ఎప్పుడూ ముందుంటాడు.

ముఖ్యంగా కొత్త డైరెక్టర్లు కథ చెప్పడానికి తన ఇంటికి లేదా ఆఫీస్ కి వస్తున్నారు అని రవితేజకి తెలిస్తే.. వాళ్ళు చెప్పిన టైం కంటే ఓ పావుగంట ముందుగానే రెడీ అయ్యి ఉంటాడట. ఈ లక్షణం కలిగిన ఏకైక టాలీవుడ్ హీరో రవితేజనే అని అంతా చెబుతూ ఉంటారు. ఇది పక్కన పెట్టేస్తే.. రవితేజ సినిమా టైటిల్స్ చాలా వెరైటీగా ఉంటాయి. గతంలో ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ ఇలా చిత్ర విచిత్రమైన పేర్లు రవితేజ సినిమాలకి ఉండటం మనం చూశాం.

అంతేకాకుండా సీనియర్ హీరోల పేర్లు వచ్చేలా కూడా రవితేజ సినిమాలు ఉన్నాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘కృష్ణ’ ‘చిరంజీవులు’ ఇలా రవితేజ సినిమాల్లో రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి వంటి సీనియర్ హీరోల పేర్లు కలిశాయి. శోభన్ బాబు పేరు ఒక్కటే బ్యాలెన్స్ అనే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇది యాదృశ్చికమే కానీ ప్లాన్ చేసింది అయితే కాదులెండి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus