టాలీవుడ్ హీరోలలో ఒకరైన రవితేజకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. రవితేజ పారితోషికం 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాకు ఒకింత నెగిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయనే సంగతి తెలిసిందే. అయితే సోలోగా రిలీజై ఉంటే ఈ సినిమా మరింత బెటర్ కలెక్షన్లను సాధించి ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రవితేజ నటించిన ఈగిల్ సినిమా 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
సంక్రాంతికి విడుదలవుతున్న ఇతర సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. (Ravi Teja) రవితేజ ఈగిల్ యాక్షన్ మూవీ కాగా ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నా మాస్ మహారాజ్ సోలో రిలీజ్ డేట్ ను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈగిల్ సినిమా ప్రమోషన్స్ మొదలుకావాల్సి ఉంది. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని కెరీర్ కు ఈ సినిమా కీలకం కానుంది.
సంక్రాంతి పండుగకు కేవలం 2 నుంచి 3 సినిమాలకు మాత్రమే రిలీజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలైతే అన్ని సినిమాలు నష్టపోయే ఛాన్స్ ఉంది. సంక్రాంతి పండుగకు ఎక్కువ మంది ప్రేక్షకులు గుంటూరు కారం సినిమాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. నాగార్జున నా సామిరంగ సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.
ఈ ఏడాది సంక్రాంతి సమయంలో థియేటర్ల విషయంలో జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. రాబోయే రోజుల్లో కూడా సంక్రాంతి పండుగకు ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. 2024 సంక్రాంతి పోటీ నెట్టింట హాట్ టాపిక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సంక్రాంతి సినిమాలలో ఎన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తాయో చూడాలి.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!