పీరియాడికల్ సినిమాలు… టాలీవుడ్‌లో ఇప్పుడు వీటికున్న క్రేజే వేరు. ఇలాంటి కథలకు విజయాలు వస్తున్నాయనో, లేక అలాంటి కథలకు ఆటోమేటిగ్గా మాస్ అప్పీలు ఉంటుందనో తెలియదు కానీ… మన హీరోలు అయితే ఇలాంటి కథ దగ్గరకు రాగానే ఓకే చెప్పేస్తున్నారు. అందులోనూ మాస్ సినిమా ఇచ్చిన టేస్ట్ తెలిసిన వాళ్లు అయితే ఇంకా త్వరగా ఓకే చెబుతున్నారు. ఇదే క్రమంలో రవితేజ కూడా ఓ పీరియాడికలల్ సినిమాకు ఓకే చెప్పారని టాక్.
యాక్షన్ ఎంటర్ టైనర్లు చేయడంలో మాస్ మహరాజా (Ravi Teja) రవితేజ స్టైల్ వేరు. అలాంటి సినిమాల్లో కూడా తనదైన టచ్ ఉండేలా చూసుకుంటారాయన. అలా సంక్రాంతి బొమ్మ ‘ఈగల్’ చేస్తున్నారు. సగటు కమర్షియల్ సినిమాకు ఈ సినిమా చాలా దూరంగా ఉంటుదని, అలా అని కమర్షియల్ సినిమా కాకుండా పోదు అని అంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత కూడా మరోసారి ప్రయోగానికి సిద్ధమవుతున్నారట. ఆ సినిమా పేరును ‘లెనిన్’ అని చెబుతున్నారు.
కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ లాంటి సినిమా చేసిన మురళి కిషోర్ అబ్బూరు ఇటీవల రవితేజకు ఓ సినిమా కథ లైన్ చెప్పారట. లైన్ ఆసక్తికరంగా ఉండటంతో ఫైనల్ వెర్షన్ అయ్యాక మరోసారి వింటానని రవితేజ చెప్పారట. దీంతో మురళీ కృష్ణ ప్రస్తుతం ఈ పనిలో బిజీగా ఉన్నారట. ‘లెనిన్’ టైటిల్ సిద్ధం చేస్తున్న ఈ కథ 90`s బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందట. ‘లెనిన్’ అని సినిమాకు పేరు పెట్టడం వెనుక కూడా పెద్ద కథే ఉందట.
‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘దసరా’ లాంటి సినిమాలు విజయాలు అందుకున్నాక అలాంటి కథలకు ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలోనే రవితేజ ‘లెనిన్’ కథ విషయంలో ఆసక్తి చూపించారు అంటున్నారు. అయితే ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫెయిల్యూర్ వల్ల ‘లెనిన్’ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని అనుకుంటున్నాడట. మరి మురళీకృష్ణ ఈ కథను ఎప్పుడు పూర్తి చేస్తారు, విన్నాక రవితేజ ఏమంటారో చూడాలి.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!