రవితేజ ఎందుకు దేవిని వద్దన్నాడు…?

ఒక్కో దర్శకుడికి ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ అంటే కంఫర్ట్ ఉంటుంది. రాజమౌళి (S. S. Rajamouli) సినిమాలకి మొదటి నుండి కీరవాణినే (M. M. Keeravani) పని చేస్తూ వస్తున్నారు. అదేంటి అంటే…? ఎందుకు? అంటే ‘నాకు మ్యూజిక్ సెన్స్ లేదు… నా ఐడియాస్ ను బాగా అర్థం చేసుకుని కీరవాణి మంచి ట్యూన్లు ఇస్తారు’ అంటూ రాజమౌళి చెబుతూ ఉంటాడు. ఇక సుకుమార్ (Sukumar) అయితే మొదటి నుండి దేవి శ్రీ ప్రసాద్ నే (Devi Sri Prasad) సంగీత దర్శకుడిగా కంటిన్యూ చేస్తున్నారు.

Ravi Teja

‘పుష్ప 2’ (Pushpa 2) విషయంలో దేవి శ్రీ ప్రసాద్ ను తప్పిస్తారు అనే వార్తలు వచ్చినా.. తమన్ (S.S.Thaman), అజనీష్ లోకనాథ్ (B. Ajaneesh Loknath) వంటి వారిని తీసుకుని కొన్ని ఎపిసోడ్స్ కి వాళ్ళతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించినా.. ఫైనల్ గా దేవి శ్రీ ఇచ్చిన ఔట్పుట్ నే సుకుమార్ తీసుకోవడం జరిగింది.అలాగే దర్శకుడు కిషోర్ తిరుమలకి (Kishore Tirumala) కూడా దేవి శ్రీ ప్రసాద్ అంటే సెంటిమెంట్. కిషోర్ తిరుమల హిట్ సినిమాలైన ‘నేను శైలజ’ (Nenu Sailaja) ‘చిత్రలహరి’ (Chitralahari) వంటి వాటికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

అలాగే ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ (Vunnadhi Okate Zindagi) ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ (Aadavallu Meeku Johaarlu) వంటి సినిమాలకు కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అవి సో సోగా ఆడినా పాటలు అన్నీ బాగానే ఉంటాయి. కిషోర్ కి కూడా దేవి మంచి ట్యూన్స్ ఇస్తుంటాడు . అందుకే రవితేజతో (Ravi Teja) కిషోర్ తిరుమల చేస్తున్న సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలని అనుకున్నాడు. కానీ హీరో ఇంట్రెస్ట్ వల్ల దేవి శ్రీని పక్కన పెట్టి భీమ్స్ ను (Bheems Ceciroleo) తీసుకున్నట్లు తెలుస్తుంది.

‘రెట్రో’ లాభాలతో సూర్య సేవా కార్యక్రమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus