Ravi Teja: బిగ్ బాస్ ఫినాలేలో కిక్ ఇచ్చిన రవితేజ..! ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున..!

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా ముగిసింది. తెలుగు సీజన్ – 6 మొదటి వారం నుంచీ రేటింగ్ లేకపోయినా, తర్వాత వారాల్లో కొంచెం రేటింగ్ పెరిగింది. ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి రవితేజ రావడంతో ఆడియన్స్ అందరూ టివిలకి అతుక్కుపోయారు. ఇక మాస్ రాజా తనదైన స్టైల్లో పంచ్ లు వేస్తూ రెచ్చిపోయాడు. ధమాకా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జునతో బిగ్ బాస్ స్టేజ్ ని షేర్ చేస్కున్న రవితేజ తన కెరియర్ తొలినాళ్లలో జరిగిన విషయాలని గుర్తు చేసుకున్నాడు.

ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాగార్జున గారే నాకు మొదటి చెక్ ఇచ్చారని, అది దాచుకుందామని అనుకున్నా కానీ, ఖర్చులకి లేవని వాడేశానని చెప్పాడు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన నిన్నే పెళ్లాడతా సినిమాకి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. అందులో ఒక చిన్న గెస్ట్ రోల్ లో కూడా కనిపించాడు రవితేజ. ఆ తర్వాత నాగార్జునతో కలిసి సీతారామరాజు సినిమా కూడా చేశాడు రవితేజ. ఇప్పుడు చాలాకాలం తర్వాత ఇద్దరూ కలిసి ఒకే స్టేజ్ పైన కనిపించడంతో ఫ్యాన్స్ కి , ఆడియన్స్ కి కన్నుల పండుగగా నిలిచింది.

ఇక బిగ్ బాస్ స్టేజ్ పైన రవితేజ స్పాట్ లో జోక్స్ వేస్తూ కుమ్మేశాడు. పార్టిసిపెంట్స్ తో మాట్లాడుతూనే తన మేనరిజంతో రెచ్చిపోయాడు. గ్రాండ్ ఫినాలేకి రవితేజ రాకతో ఆడియన్స్ కి మంచి కిక్ వచ్చిందనే చెప్పాలి. ఇక హౌస్ లోకి సిల్వర్ సూట్ కేస్ తీస్కుని వెళ్తూ ఎంట్రీ ఇచ్చేసరికి హౌస్ మేట్స్ షాక్ అయిపోయారు. రవితేజని చూడగానే రేవంత్, శ్రీహాన్ ఇంకా కీర్తి ముగ్గురూ కూడా కాసేపు షాక్ అయిపోయారు. ఆ తర్వాత రవితేజ సిల్వర్ సూట్ కేస్ లో మనీని తీస్కుని వచ్చి వాళ్లని టెమ్ట్ చేశాడు.

15లక్షల వరకూ ఇస్తానని, నాతో వచ్చేయమని చెప్పాడు. కానీ, ముగ్గురూ ఎవ్వరూ కూడా టెమ్ట్ అవ్వలేదు. దీంతో రవితేజ వాళ్లకి బైబై చెప్పి వచ్చేశాడు. నిజానికి రియాలిటీ షోలో ఎప్పుడూ ముగ్గురు ఉన్నప్పుడు ఇలా డబ్బులు ఆఫర్ చేసి వారిని టెమ్ట్ చేస్తుంటాడు బిగ్ బాస్. ఈసారి కూడా అలాగే జరిగింది. అయితే, ఫైనల్ గా ఉన్న శ్రీహాన్ – రేవంత్ ఇద్దరిలో మాత్రం శ్రీహాన్ టెమ్ట్ అయిపోయి గోల్డెన్ బ్రీఫ్ కేస్ ని తీస్కున్నాడు. దీంతో 40 లక్షలు గెలుచుకున్నాడు. నాగార్జున హోస్ట్ గా ఫైనల్ గా రేవంత్ ని విన్నర్ గా ప్రకటించి, ఆడియన్స్ మాత్రం శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు వేశారని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు.

నాగార్జున ఇచ్చిన ఈ ట్విస్ట్ కి అక్కుడున్న పార్టిసిపెంట్స్ తో పాటుగా, టెలివిజన్ లో చూస్తున్న ప్రేక్షకులు కూడా ఒక్కసారి షాక్ అయ్యారు. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ అన్నీ రేవంత్ విన్నర్ అనే ఓట్లు వేశారు. కానీ, నాగార్జున అఫీషియల్ ఓటింగ్ లో టాప్ – 1 లో శ్రీహాన్ ఉన్నాడని చెప్పేసరికి శ్రీహాన్ తప్పు నిర్ణయం తీస్కున్నాడా అనే అనిపిస్తోంది. మొత్తానికి నాగార్జున ఇచ్చిన ట్విస్ట్, రవితేజ ఇచ్చిన కిక్ తో గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా ముగిసిందనే చెప్పాలి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus