‘క్రాక్‌’ ప్రి రిలీజ్‌లో రవితేజ ఏమన్నాడంటే…

బాక్సాఫీసు దగ్గర సరైన సినిమా వచ్చి చాలా రోజులైంది. మొన్నీమధ్య వచ్చినా సరైన పోటీ లేక వన్‌ మ్యాన్‌ షో అయిపోయింది. అయితే సంక్రాంతికి ఆ సరదా తీరబోతోంది. ‘క్రాక్‌’, ‘రెడ్‌’, ‘అల్లుడు అదుర్స్‌’, ‘మాస్టర్‌’ సందడి చేయడానికి వరుస కడుతున్నాయి. అందులో మా సినిమా హిట్‌ అవ్వాలని అందరికీ ఉంటుంది. అయితే అన్నీ హిట్‌ అయ్యి బాక్సాఫీసును డబ్బులతో నింపేయాలని చిత్రపరిశ్రమ కోరుకుంటోంది. మరి ఏసినిమా క్రాక్‌ చేస్తుందా చూడాలి. ఈ నేపథ్యంలో ‘క్రాక్‌’ ప్రి రిలీజ్‌ ఈవెంట్ జరిగింది.

వేదికపై ‘ష్యూర్‌ షాట్‌ హిట్‌ కొడతాం.. హ్యాట్రిక్‌ కొడతాం’ అంటూ రవితేజ అభిమానుల్లో హుషారు నింపే ప్రయత్నం చేశాడు. ‘‘సినిమా పాటలు మంచి హిట్‌ అయ్యాయి. కాసర్ల శ్యామ్‌, రామజోగయ్య గారు మంచి పాటలు రాశారు. సముద్రఖనితో ‘శంభో శివ శంభో’ చేశాను. ఆయన నటిస్తూనే ఉన్నా రాయడం ఆపలేదు. బుర్రా సాయిమాధవ్‌, వివేక్‌, వంశీ, సుధాకర్‌ అందరూ బాగా చేశారు. అప్సర రాణి ఐటెమ్‌ సాంగ్‌లో అదరగొట్టేసింది. జేకే విష్ణుతో పని చేయడం సంతోషంగా ఉంది. ఫైట్‌ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆలీ, నేను కలసి తీసిన సినిమాలన్నీ హిట్టే. తమన్‌ ఎప్పటిలాగే వావ్‌ అనిపించాడు’’ అంటూ చిత్రబృందం గురించి చెప్పాడు రవితేజ.

‘‘దర్శకుడు గోపీచంద్‌ మలినేని చాలా కష్టపడ్డాడు. మేం హ్యాట్రిక్‌ కొట్టబోతున్నాం. మా కాంబినేషన్‌ ఇలా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. నిర్మాతలు అమ్మిరాజు, మధు గారి గల్లా పెట్టెలు నిండాలని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్‌ చెప్పినట్లు మిగిలిన విషయాలు సక్సెస్‌ మీట్‌లో మాట్లాడుకుందాం. ఈ సారి కచ్చితంగా హిట్‌ కొడతాం’’ అంటూ రవితేజ చెప్పుకొచ్చాడు. ఇక్కడిదాకా బాగుంది… సినిమా బిజినెస్‌ మాత్రం ఆ రేంజిలో జరగలేదు అంటున్నారు. మరి రిలీజ్‌ తర్వాత టాక్‌తో ఏమన్నా ఫేట్‌ మారుతుందేమో చూడాలి.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus