Ravi Teja, Nani: క్రిస్మస్ వార్ లో ఇద్దరు హీరోలు!

ఈ ఏడాది డిసెంబర్ లో చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాను డిసెంబర్ 17న రిలీజ్ చేయబోతున్నారు. ఆ తరువాత బాలకృష్ణ ‘అఖండ’ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలతో పాటు రవితేజ, నాని నటిస్తోన్న సినిమాలను కూడా విడుదల చేయబోతున్నారట. నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు.

ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నారు. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ లాంటి తారలు ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో పాటు రవితేజ తన ‘ఖిలాడి’ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి వరుసగా పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి.‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘ఎఫ్3’ ఇలా చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి.

వాటికి పోటీగా రిలీజ్ చేయడం కంటే డిసెంబర్ లోనే తన సినిమాను రిలీజ్ చేయడం బెటర్ అని అనుకుంటున్నారు రవితేజ. కానీ నానితో మాత్రం పోటీ తప్పడం లేదు. మొత్తానికి క్రిస్మస్ వార్ కోసం ఇద్దరు హీరోలు సిద్ధమవుతున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus