Ravi Teja: మాస్ మహారాజ్ సినిమాలో మలయాళం హీరోయిన్..!

  • May 25, 2021 / 04:17 PM IST

మలయాళంలో వరుస సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి రజిష విజయన్ ఇటీవల తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘కర్ణన్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను ప్రశంసల వర్షం కురిసింది. త్వరలోనే ఈమె తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించడానికి రెడీ అవుతుంది. అవును తాజాగా ఈమెకు టాలీవుడ్ నుండీ కూడా పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది.మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో ఈమెకు ఛాన్స్ దక్కినట్టు తాజా సమాచారం.

ప్రస్తుతం రవితేజ.. రమేష్ వర్మ డైరెక్షన్లో ‘ఖిలాడీ’ అనే యాక్షన్ మూవీ చేస్తున్నాడు.కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన వెంటనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది.ఇక ఈ చిత్రం పూర్తయిన వెంటనే శరత్ మండవ అనే యువ దర్శకుడిని పరిచయం చేస్తూ రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు. ‘ఎస్.ఎల్‌.వి సినిమాస్ ఎల్.ఎల్‌.పి’ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ఇక ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా ఎంపికైనట్టు ఆల్రెడీ ప్రకటించారు.

అయితే కథ ప్రకారం ఈ చిత్రంలో మరో హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందట. దాంతో ‘కర్ణన్’ నటి రజిష విజయన్ ను ఎంపిక చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. కేవలం తెలుగులోనే కాదు దక్షణాది భాషలన్నిటిలో నుండి ఈమెకు అవకాశాలు వస్తున్నాయి అని సమాచారం. గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రలనే ఈమె ఎంపిక చేసుకుంటూ వస్తుంది.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus