Ravi Teja: ఎవరు ఎవర్ని ఏస్తారో చూస్కుందాం… రవితేజ మాస్‌ వార్నింగ్‌!

సినిమాలో ఓ నటుడిని తీసుకునేటప్పుడు ఆ సినిమా నిర్మాణ సంస్థ వెల్‌కమ్‌, ఆన్‌బోర్డ్‌ అంటూ ఆ నటుణ్ని ఆహ్వానిస్తుంటారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటారు. అయితే ఇలాంటి పోస్టులు పెట్టడం, వాటికి కామెంట్లు పెట్టడంలో మాస్‌ మహారాజ్‌ లెక్కే వేరు. ఏంటీ ఏమైనా డౌట్‌ ఉందా? అయితే ఓసారి అతని ట్విటర్‌ పేజీ ఓపెన్‌ చేసి చూడండి. వార్నింగ్‌ కనిపిస్తుంది. అది కూడా మాస్ వార్నింగ్‌ కనిపిస్తుంది.

ప్రస్తుతం రవితేజ (Ravi Teja) ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) అనే సినిమా చేస్తున్నాడు. హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బాలీవుడ్‌ హిట్ ‘రైడ్‌’కి రీమేక్‌. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం జగపతి బాబును (Jagapathi Babu) తీసుకున్నారు. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బాగానే ట్వీట్ చేసింది. అయితే ఆ తర్వాతే మొదలైంది అసలు కథ. సినిమాలో నటిస్తున్నా అంటూ జగపతిబాబు చెబుతూ… ‘‘మిస్టర్‌ బచ్చన్‌లో మాస్‌ మహారాజ్‌ని వేసేయడానికి సిద్ధం’’ అని రాసుకొచ్చాడు.

దానికి రవితేజ రియాక్ట్‌ అవ్వడమే ఇక్కడ విషయానికి కారణం. జగపతిబాబుకు ఏ మాత్రం తగ్గకుండా ‘‘మిస్టర్ బచ్చన్ ఇక్కడ, ఎవరు ఎవర్ని ఏస్తారో చూసుకుందాం’’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ మాటామంతి సినిమా ఫ్యాన్స్‌ను, రవితేజ అభిమానులను ఆకట్టుకుంటోంది. రవితేజ స్టైలే వేరు… భలేగా రిప్లై ఇచ్చారు అని కొందరు అంటే.. మరికొందరేమో జగపతిబాబు కూడా భలే మాట్లాడారు అని కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే… భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse)  కథానాయికగా ఈ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేస్తారట. క్లైమాక్స్‌లో సినిమా సెకండ్ పార్ట్‌ కూడా హింట్‌ ఇస్తారట. ఎందుకంటే అజయ్‌ దేవగణ్‌ బాలీవుడ్‌లో రెండో ‘రైడ్‌’ తీస్తుంటే… ‘మిస్టర్‌ బచ్చన్‌’ టీమ్‌ వెళ్లి మరీ క్లాప్‌ కొట్టి వచ్చింది. ఆ లెక్కన రెండో ‘మిస్టర్‌ బచ్చన్‌’ వస్తున్నట్లేగా.

https://twitter.com/RaviTeja_offl/status/1777003833589461372

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus